బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో శశికళ మౌనవ్రతం, మూడో ప్రపంచ యుద్దం వస్తుందా ? చాలా విడ్డూరంగా ఉంది!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు శశికళ నటరాజన్ హాజరుకారని, చిన్నమ్మ మౌనవ్రతం చేస్తున్నారని ఆమె న్యాయవాది మంగళవారం మీడియాకు చెప్పారు.

జనవరి పూర్తిగా !

జనవరి పూర్తిగా !

చిన్నమ్మ శశికళ డిసెంబర్ 5వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో మౌన వత్రం చేస్తున్నారని ఆమె న్యాయవాది చెన్నైలో మీడియాకు చెప్పారు. శశికళ జనవరి నెల చివరి వరకూ మౌనవ్రతం చేస్తారని న్యాయవాది అన్నారు.

 కారణం అదే !

కారణం అదే !

శశికళ మౌనవ్రతం చేస్తున్నందు వలనే రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు హాజరుకారని ఆమె న్యాయవాది వివరణ ఇచ్చారు. శశికళ మౌనవ్రతం చేస్తున్నారనే విషయం ఆమె న్యాయవాది మీడియాకు చెప్పడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

 ఎవరిని ఉద్దరించడానికి !

ఎవరిని ఉద్దరించడానికి !

ఎవరిని ఉద్దరించడానికి శశికళ జైల్లో మౌనవ్రతం చేస్తున్నారని సోషల్ మీడియాలో ఎద్దవే చేస్తున్నారు. ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారనే భయంతోనే శశికళ మౌనవత్రం చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని మండిపడుతున్నారు.

శశికళకు మాత్రమే తెలుసు !

శశికళకు మాత్రమే తెలుసు !

జయలలిత చికిత్స విషయంలో అసలు ఏం జరిగిందో ఒక్క శశికళకు మాత్రమే తెలుసని, ఇప్పుడు విచారణ జరుగుతున్న సమయంలో తాను మౌనవ్రతం చేస్తున్నానని చిన్నమ్మ డ్రామాలు ఆడుతున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఏ పరిస్థితిలో ఆసుపత్రికి అమ్మ !

ఏ పరిస్థితిలో ఆసుపత్రికి అమ్మ !

శశికళ ఒక్క రోజు మౌనవ్రతం పక్కన పెట్టి జయలలితకు ఎలాంటి చికిత్స అందించాం, అమ్మను ఏ పరిస్థితిలో ఆసుపత్రిలో చేర్పించాం అని ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు చెప్పాలని అనేక మంది అమ్మ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

 మూడో ప్రపంచ యుద్దం !

మూడో ప్రపంచ యుద్దం !

శశికళ మౌనవ్రతం పక్కనపెడితే మూడు ప్రపంచ యుద్దం వస్తుందా ? అంటూ సైటర్లు వేస్తున్నారు. ఇంత కాలం ఆమె చేసింది చాలని ఆరోపిస్తున్నారు. శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అందర్నీ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ విచారణ చెయ్యాలని జయలలిత అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

English summary
Netizens making fun of Sasikala's silent fasting. Sasikala's lawyer says that she can not appear in the inquire commission due to her silent fasting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X