గంభీర్.. నువ్వింత దిగజారుతావనుకోలేదు!

ఢిల్లీ : ఢిల్లీ ఈస్ట్ నియోజకవర్గంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంత వరకు పార్టీపరంగా విమర్శలు సంధించిన నేతలు ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. తాజాగా ఆప్ ఎంపీ అభ్యర్థి ఆతిషిని కించపరిచేలా ఉన్న పాంప్లెట్లు పంచిపెట్టడం పెద్ద దుమారమే రేపింది. ఈ పాంప్లెట్ల వెనుక బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్ హస్తం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆతిషి ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.

పాంపెట్ల అంశంపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. "గౌతం గంభీర్ ఇంత నీచానికి దిగజారుతారని ఎన్నడూ ఊహించలేదు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారి నుంచి మహిళలు ఎలా భద్రతను ఆశిస్తారు. ఆతిషి అధైర్యపడకు. మీరిప్పుడు ఎలాంటి పరిస్థితి అనుభవిస్తున్నారో అర్థం చేసుకోగలను. ఇలాంటి శక్తులతో మనం పోరాడుతున్నాం" అంటూ ట్వీట్ చేశారు.

Never imagined Gautam Gambhir to stoop so low : Atishi

గంభీర్‌కు రెండు చోట్ల ఓటు హక్కు ఉందంటూ ఆప్ ఎంపీ అభ్యర్థి ఆతిషి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో అప్పటి నుంచి ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+