చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హ్యాట్సాఫ్ గీతా: డ్రైనేజీలో ఇరుక్కుపోయిన శిషువు..దూకి కాపాడిన ఇల్లాలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

డ్రైనేజీలో ఇరుక్కుపోయిన శిషువు..దూకి కాపాడిన ఇల్లాలు

మనదేశానికి స్వతంత్రం సిద్ధించి 72 ఏళ్లు కావొస్తోంది. కానీ కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. వారి కామవాంఛ తీర్చుకునేందుకు కనీస జాగ్రత్తలు పాటించకుండా.. తీరా గర్భం దాల్చి పిల్లలను కనేసి రోడ్డుపై వదిలేస్తున్నారు కొందరు కసాయి మహిళలు. పుడుతానే కాటికి పంపాలని కన్నతల్లి భావించినప్పటికీ... ఆ బిడ్డ బాగోగులు మేము చూసుకుంటామని ముందుకు వస్తున్నారు సామాజిక స్పృహ ఉన్న నెటిజెన్లు.

ఇక విషయానికొస్తే...బుధవారం దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మునిగి ఉండగా... ఓ చంటి పిల్లాడికి మాత్రం తన కసాయి తల్లి నుంచి స్వాతంత్ర్యం లభించింది. తన ఇంటికొచ్చిన పాలవాడి నుంచి పాలు పోయించుకుందామని ఉదయాన్నే గీతా అనే మహిళ ఇంటినుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో కేర్ కేర్ మని ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. ఎవరో చూద్దామని గేటు బయటకు వచ్చింది. అయితే అటూ ఇటూ చూసిన గీతకు మాత్రం చిన్న పిల్లాడి గొంతు మాత్రం వినపడుతుంది కానీ పిల్లాడు మాత్రం కనిపించడంలేదు. మళ్లీ అదే ఏడుపు వినిపించింది. అయితే ఈ సారి ఎవరా అని గీతా కాస్త గట్టిగా ప్రయత్నించింది. అయితే ఈ సారి కనుగొనింది. పిల్లాడి ఏడుపు అక్కడే ఉన్న డ్రైనీజీలోనుంచి వస్తోంది.

New born found inside drain,Rescued by a woman after hearing cries

ఇది గమనించిన గీతా ముందుగా డ్రైనీజీ మూతను తొలగించి లోపలికి తొంగి చూసింది. అక్కడే ఇంకా బొడ్డు తాడు కూడా తొలగించని చిన్నారి కేర్ కేర్ మని ఏడుస్తూ కనిపించాడు. ఈ చిట్టితండ్రి ఎక్కడి నుంచో కొట్టుకొచ్చాడు. అక్కడ డ్రైనీజీలో మధ్యలో ఏదో అడ్డుగా ఉండటంతో ఇరుక్కుపోయాడు. ఇది సరిగ్గా గీతా ఇంటిముందు ఉన్న డ్రైనేజీనే కావడంతో ఆమె స్పందించింది. లేకపోతే చిన్నారి పరిస్థితి ఏమై ఉండేదో ఊహిస్తే ఎవరికైనా సరే గుండె బరువెక్కక మానదు. చిన్నారి ఏడుపు విన్న గీత వెంటనే ఆ బిడ్డను కాపాడే ప్రయత్నం చేసింది. మెల్లగా బిడ్డ కాలు పట్టుకుని పైకి లాగింది.

అప్పటికే అక్కడికి జనం గుమికూడారు. వారిని కాస్త నీళ్లు తీసుకురావాల్సిందిగా కోరింది. ముందుగా చిన్నారిని శుభ్రంగా కడిగింది. ఆ తర్వాత చెన్నై ఎగ్మోర్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకెళ్లింది. ఆస్పత్రిలో చేర్పించగానే చంటి బిడ్డ ముందుగా ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వైద్యులు చికిత్స అందించగానే సాధారణ స్థితికి చేరుకున్నాడు. దీంతో గీతా ఆ బిడ్డకు ఊపిరి పోసి ఆమె ఊపిరి పీల్చుకుంది. స్వాతంత్ర్యం దినోత్సవం రోజున బిడ్డ తనకు దొరికాడు కాబట్టి ఆ బిడ్డకు స్వతంత్రరామ్ అనే నామకరణం చేస్తున్నట్లు గీత తెలిపింది.

New born found inside drain,Rescued by a woman after hearing cries

చిన్నారి స్వతంత్రరామ్ ఆరోగ్యం బాగానే ఉందని పోలీసులు తెలిపారు. చిన్నారిని తొందరలోనే చిన్నపిల్లల సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని చెప్పారు. చిన్నారిని డ్రైనేజీ నుంచి బయటకు తీసుకువచ్చినప్పటి నుంచి ఆస్పత్రికి చేర్చే వరకు ఆ మొత్తం ఘటనను కొందరు స్థానికులు వీడియో తీసి... సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చిన్నారి బాగోగులు తాము చూసుకుంటామని నెటిజెన్లు స్పందించారు. అంతేకాదు కొందరు ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచుకుంటామని చెబుతున్నారు.అయితే ఎలా అప్రోచ్ అవ్వాలంటూ అడుగుతున్నారు. గీత చేసిన కృషిని అభినందిస్తున్నారు. చంటి పిల్లలు వద్దనుకునే వాళ్లు ప్రభుత్వ ఆస్పత్రిలో అప్పగించవచ్చని... వారికి ఎప్పుడూ ఒక ఉయ్యాల సిద్ధంగా ఉంటుందని నాటి దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రత్యేకంగా ఓ పథకం ప్రారంభించింది. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు అక్కడ చోటుచేసుకోవడం దురద‌ృష్టకరం అని చెప్పాలి.

English summary
Early in the morning on the country's 72nd Independence Day, Geeta was alerted by a milkman about a sound coming from a nearby storm water drain in Chennai's Valasaravakkam. They heard what appeared to be the sound of someone crying. Could even be a kitten stuck inside, they thought.So she stopped and decided to take a look, to see what is stuck in the drain.What she saw made her jump -- an abandoned newborn with the umbilical cord still intact, wrapped around his neck, was inside the drain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X