శోభనం క్యాన్సిల్ చేసి ఫ్యామిలీతో సంబరాలు, మరుసటి రోజు పెళ్లికూతురు ఎస్కేప్, నగలు, నగదు !

హరియానా/గురుగ్రామ్: వయసుకు వచ్చిన కొడుక్కి పెళ్లి చెయ్యాలని ఓ వ్యాపారి అనేక ప్రయత్నాలు చేశాడు. కొడుక్కి బుద్ది అంతంతమాత్రంగా ఉండటంతో అంత త్వరగా పెళ్లి (marriage) సంబంధాలు కుదరలేదు. తరువాత ఓ ఫ్రెండ్ సహాయంతో ఓ పెళ్లి సంబంధం ఫిక్స్ అయ్యింది. పెళ్లి కూడా జరిగిపోయింది. పెళ్లి రోజు రాత్రి శోభనం జరగలేదు. పెళ్లి కొడుకు ఇంటి సంప్రధాయం ప్రకారం అర్దరాత్రి దాటేవరకు ఆ ఇంట్లో పెళ్లిసందడితో అందరూ ఎంజాయ్ చేశారు. మరుసటి రోజు పెళ్లికూతురు జెండా ఎత్తేసింది.

హరియానాలోని గురుగ్రామ్ (gurugram) జిల్లాలోని బిలాస్‌పూర్ ప్రాంతంలో పెళ్లి (marriage) జరిగిన మరుసటి రోజే పెళ్లికూతురు భారీ మొత్తంలో డబ్బు, బంగారు నగలతో పారిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. పెళ్లి అయిన రెండో రోజే 1.5 లక్షల నగదు (lakh), లక్షలాది రుపాయల విలువైన బంగారు (gold) నగలతో భార్య ఇంటి నుంచి పారిపోయిన (absconded) విషయం తెలుసుకున్న భర్త నెత్తినోరు కొట్టుకుంటున్నాడు.

New bride absconded with Rs 1.50 lakh cash and gold jewelery in Gurugram
New bride absconded with Rs 1.50 lakh cash and gold jewelery in Gurugram

బిలాస్‌పూర్‌లోని భోడా ఖుర్ద్‌ లో నివాసం ఉంటున్న వ్యాపారి అశోక్ కుమార్ అతని చిన్న కుమారుడికి పెళ్లి (marriage) చేసేందుకు అమ్మాయిల కోసం చూశాడు. ఈ సమయంలో కుమార్‌కు పరిచయస్థుల్లో ఒకరైన మనీష్ ద్వారా మంజు అనే వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. తన కొడుక్కి సరైన అమ్మాయి దొరకడానికి సహాయం చెయ్యాలని అశోక్ కుమార్ మంజుకు చెప్పాడు.

జులై నెలలో భట్సానా గ్రామానికి చెందిన మనీషా అనే మహిళను మంజు అశోక్ కుమార్ కు పరిచయం చేశాడు. తరువాత మనిషా అనే మహిళ ప్రీతి అనే యువతిని అశోక్ కుమార్ కు చూపించి మీ అబ్బాయికి ఈమె సరిగ్గా సరిపోతుందని చెప్పింది. ప్రీతి చాలా మంచి అమ్మాయి అని, ఈమెను పెళ్లి చేసుకుంటే మీ కుమారుడు సుఖపడుతాడని మంజు, మనిషా కలిసి అశోక్ కుమార్ కు బ్రైన్ వాష్ చేశారు. దీని తర్వాత అశోక్ కుమార్ చిన్న కొడుకు ప్రీతిని చూసి ఆమె ప్రేమలో పడ్డాడు.

New bride absconded with Rs 1.50 lakh cash and gold jewelery in Gurugram
ఊరిలో దేవుడి ఊరేగింపులో హంగామా, కళ్లు బైర్లుకమ్మి పోలీసు ముఖం పచ్చడి, వీడియో వైరల్ తో !

ప్రీతి కుటుంబానికి లక్ష రూపాయలతో పాటు పెళ్లికి అవసరం అయిన పెళ్లి (marriage) దస్తులు అన్ని మేమే తీసిస్తామని అశోక్ కుమార్ ప్రీతి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. జులై 26వ తేదీన మంజు, అతని సహచరులు ప్రీతితో కలిసి జాజ్జర్ కోర్టుకు వచ్చారు. కోర్టులో అశోక్ కుమార్ కొడుక్కి, ప్రీతికి వివాహం (marriage) జరిగింది. ఆ తర్వాత నా కోడలు ప్రీతితో పాటు మా మాఇంటికి తిరిగి వచ్చామని అశోక్ కుమార్ చెప్పాడు.

ఆ రోజు అర్థరాత్రి వరకు మా ఇంట్లో సంబరాలు జరిగాయి. ముహూర్తం సరిగా లేదని ఆ రోజు నా కొడుక్కి, కోడలు ప్రీతికి శోభనం(first night) జరగలేదని అశోక్ కుమార్ పోలీసులకు చెప్పాడు. మరుసటి రోజు ఉదయం పెళ్లి కొడుకు (husband) ఉద్యోగానికి వెళ్లిపోయాడు. తరువాత తన కోడులు ప్రతీ కనిపించలేదని, ఆమె కోసం చాలా ప్రాంతాల్లో వెతికామని అశోక్ కుమార్ పోలీసులకు చెప్పాడు.

ఇంటిలో పరిశీలించగా కోడలు ప్రీతితో పాటు బీరువాలో ఉన్న రూ1. 50 లక్షల నగదు, భారీ మొత్తంలో బంగారు (gold) నగలతో సహ ప్రీతి పరార్ (absconded) అయ్యిందని గుర్తించామని అశోక్ కుమార్ అంటున్నారు. తరువాత అశోక్ కుమార్ పెళ్లి మధ్యవర్తి మంజుని సంప్రదిస్తాడు, అతను ప్రీతిని పట్టివ్వడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చాడు.

అప్పటి నుంచి ప్రీతి కోసం వెతుకుతూనే ఉన్నామని, అయినా ఫలితం లేదని అశోక్ కుమార్ అంటున్నాడు. అయితే చివరికి మంజు సహచరులను సంప్రదించగా ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేయకపోతే నిన్ను చంపేస్తామని (muder) బెదిరించారని అశోక్ కుమార్ సోమవారం రాత్రి పోలీసులకు (police) ఫిర్యాదు చేశాడు. ప్రీతి పెళ్లి ఫోటోలు సేకరించామని, ఆమె కోసం గాలిస్తున్నామని గురుగ్రామ్ (gurugram)పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+