ఊరిలో దేవుడి ఊరేగింపులో హంగామా, కళ్లు బైర్లుకమ్మి పోలీసు ముఖం పచ్చడి, వీడియో వైరల్ తో !
బెంగళూరు/ దావణగెరె: ఎవరైన పండుగలు ఒకరోజు లేదా రెండు రోజులు లేదా వారం రోజుల్లో పూర్తి చేస్తారు. కర్ణాటకలో (Karnataka) ఓ ఆచారం ఉంది. వినాయకచవితి పండుగలు కాని, దసరా (dussehra) ఉత్సవాలు, కన్నడ రాజ్యోత్సవం కార్యక్రమాలు కాని నెల రోజులు, లేదా రెండు నెలలు పాటు నిర్వహిస్తారు. ఒక ప్రాంతంలోని ప్రజలు మరో ప్రాంతంలోని వారిని, స్నేహితులు, బంధువులను పండుగలకు ఆహ్వానించడానికి వినాయకచవితి (vinayaka chaturthi) పండుగలు, కన్నడ రాజ్యోత్సవాలను నెలల తరబడి చేస్తూనే ఉంటారు.
కర్ణాటకలో ప్రస్తుతం వినాయకచవితి (vinayaka chaturthi)ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, పోలీసుల నియమాలు పాటించి వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న యువకులు అదే నియమాలు పాటిస్తూ ఊరేగింపులు (procession) చేస్తున్నారు. దసరా పండుగ సందర్బంగా వినాయకుడి (vinayaka chaturthi)విగ్రహాలు, దుర్గా దేవి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న యువకులు రంగరంగ వైభవంగా ఊరేగింపులు చేస్తున్నారు.

వినాయకుడి (vinayaka chaturthi)విగ్రహం ఊరేగింపు సందర్బంగా డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌పై మద్యం మత్తులో ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన కర్ణాటకలోని దావణగెరె (davangere) జిల్లాలో చోటుచేసుకుంది.దావణగెరె జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన హిందూ మహాసభ గణపతి విసర్జన (vinayaka chaturthi) శోభాయాత్ర ఊరేగింపులో (procession) వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. వినాయకుడి విగ్రహం ఊరేగింపు సందర్భంగా బందోబస్తు కోసం పోలీసు సిబ్బందిని నియమించారు.
పీబీ రోడ్డులో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్‌పై (police) మద్యం మత్తులో ఓ వ్యక్తి దాడి చేశాడు. ఓ వ్యక్తి పోలీసు సిబ్బందిని దూషించాడు. మద్యం మత్తులో ఓ పోలీసు కానిస్టేబుల్ ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి డ్యూటీలో ఉన్న పోలీసు మీద దాడి చేస్తున్న సమయంలో కొందరు వీడియోలు తీశారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (social media) వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై దావణగెరె పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో ఘాతుకానికి ఒడిగట్టిన మందుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కళ్లు నెత్తికి ఎత్తి పోలీసులనే రక్తం వచ్చేలా కొట్టిన వ్యక్తికి ఇంకా మందు కిక్కు దిగలేదని తెలిసింది. మనోడికి కిక్కు దిగిన తరువాత విమానం ఎక్కించడానికి పోలీసులు సిద్దం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పోలీసు ముఖం పచ్చడి అయ్యేలా దాడి చేసిన మందుబాబుకు పోలీస్ స్టేషన్ లో మామలు కుడుములు, కజ్చికాయలు పెట్టి పంపిస్తారని స్థానికులు జోకులు వేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications