వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

New Covid variant: ఆ దేశాల నుంచి ఎవరు వచ్చినా క్వారంటైన్ లో ఉండాలి, మేయర్ ఆదేశాలు !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకుంటున్నామని అనుకుంటున్న ప్రజలకు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బతో ఆందోళనలు మొదలైనాయి. ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో అప్రమత్తంగా ఉండాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా, బోట్స్వానా హాంకాంగ్, ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ కు పంపించాలని భారతదేశ ఆర్థిక రాజధాని ముంబాయి నగర మేయర్ కిషోరి పెడ్నేకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి భారత్ కు వస్తున్న వారికి ఎయిర్ పోర్టులోనే ఆరోగ్య పరీక్షలు చెయ్యాలని పలు నగరాలకు చెందిన అధికారులు డిసైడ్ అయ్యారు. శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో అధికారులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.

RRR: ఆర్ఆర్ఆర్ కన్నడ పాట రిలీజ్, మీడియా ప్రశ్నలకు ఒకేఒక్క మాట చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి !RRR: ఆర్ఆర్ఆర్ కన్నడ పాట రిలీజ్, మీడియా ప్రశ్నలకు ఒకేఒక్క మాట చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి !

ఒమిక్రాన్ దెబ్బతో గజగజా వనికిపోతున్న ప్రజలు

ఒమిక్రాన్ దెబ్బతో గజగజా వనికిపోతున్న ప్రజలు

దక్షిణాఫ్రికా (సౌత్ ఆఫ్రికా)లో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే ఆ పొరుగు దేశాలకు వ్యాపించడంతో ప్రజలు హడలిపోతున్నారు. కోవిడ్ టీకా (కరోనా వైరస్ టీకాలు) రెండు డోసులు వేసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకుతుందని వెలుగు చూడటంతో ప్రజలు భయంతో ఉలిక్కిపడి బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు.

 డెల్టాకంటే ప్రమాదకరం ?

డెల్టాకంటే ప్రమాదకరం ?

అధిక మ్యూటేషన్ల కారణంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా ప్రమాదకరి కావచ్చని, ఇది చాలా వేగంగా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు నిపుణలు హెచ్చరిస్తున్న నేపధ్యంలో ప్రపంచ దేశాలు ఆ వేరియంట్ ను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం

ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న సమయంలోనే నేడు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. దేశంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రిక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇదే సమయంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.

ముంబాయిలో కౌంట్ డౌన్

ముంబాయిలో కౌంట్ డౌన్

సౌత్ ఆఫ్రికా, బోట్స్వానా హాంకాంగ్, ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ కు పంపించాలని భారతదేశ ఆర్థిక రాజధాని ముంబాయి నగర మేయర్ కిషోరి పెడ్నేకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ దేశాల నుంచి ముంబాయికి ఎవ్వరూ వచ్చినా కచ్చితంగా క్వారంటైన్ కు తరలించాలని, సామాన్య ప్రజలు ఆ మహమ్మారి బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముంబాయి మేయర్ కిషోరి పెడ్నేకర్ ముంబాయి ఆరోగ్య శాఖ అధికారులకు కట్టదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు.

భారత్ లోని అనేక నగరాలు అదేబాటలో !

భారత్ లోని అనేక నగరాలు అదేబాటలో !

విదేశాల నుంచి భారత్ కు వస్తున్న వారికి ఎయిర్ పోర్టులోనే ఆరోగ్య పరీక్షలు చెయ్యాలని భారతదేశంలోని పలు నగరాలకు చెందిన అధికారులు డిసైడ్ అయ్యారని తెలిసింది. శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో అధికారులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటున్నారని సమాచారం. మొత్తం మీద కరోనా దెబ్బతో ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్న ప్రజలు ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బతో మరోసారి హడలిపోతున్నారు.

English summary
New Covid variant: Kishori Pednekar, Mayor of Mumbai, announced on Saturday that all those coming to the city from South Africa will be quarantined on account of the new coronavirus variant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X