బలూచిస్తాన్ వ్యవహారాల్లో నిపుణుడుగా పేరొందిన అనిల్ కుమార్ ' రా చీప్ గా నియామకం
ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ గా రాజీవ్ జైన్, రా కు అనిల్ కుమార్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. బలూచిస్తాన్ వ్యవహారాల్లో అనిల్ కుమార్ నిపుణుడిగా పేరొంది. కాశ్మీర్ వ్యవహారాల్లో రాజీవ్ కు అపార అనుభవం ఉంది
న్యూఢిల్లీ :కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ చీప్ గా అనిల్ కుమార్ దస్ మానాను , ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ గా రాజీవ్ జైన్ ను నియమించింది. అనిల్ కుమార్ ఆయన గత 23 ఏళ్ళ నుండి ' రా 'లోని పలు విభాగాల్లో పనిచేస్తున్నారు.ఆయన బలూచిస్తాన్ వ్యవహరాల్లో నిపుణుడిగా పేరుపొందాడు.కాశ్మీర్ వ్యవహారాల్లో నిపుణుడిగా రాజీవ్ జైన్ కు మంచి పట్టుంది. అందుకే కేంద్రం వీరిద్దరిని కీలకమైన విభాగాధిపతులుగా నియమించింది.
1981 మధ్యప్రదేశ్ బ్యాచ్ కు చెందిన అనిల్ కుమార్ దస్ మానా 2017 జనవరి 30 వ, తేదిన బాద్యతలను స్వీకరించనున్నారు. ' రా 'చీఫ్ గా విధుల్లో కొనసాగుతున్న రాజేందర్ ఖన్నా స్థానంలో ఆయన భాద్యతలను స్వీకరించనున్నారు.వచ్చే ఏడాది జనవరి చివరివారంలో రాజేందర్ ఖన్నా పదవీకాలం ముగియనుంది. దీంతో అనిల్ కుమార్ ఆయన స్థానంలో భాద్యతలను తీసుకోనున్నారు.
కౌంటర్ టెర్రరిజం, ఇస్లామిక్ వ్యవహరాల్లో అనిల్ కుమార్ కు పట్టుంది. దరిమిలా ఆయనను ' రా ' చీఫ్ గా నియమించారని తెలుస్తోంది. ఆయన 23 ఏళ్ళుగా ' రా 'లో పలు విభాగాల్లో పనిచేసినా, బలూచిస్తాన్ వ్యవహారాల్లో ఆయనకు మంచి పట్టుంది. ఈ కారణంగానే ఆయనను రా చీఫ్ గా నియమించారని తెలుస్తోంది.రాజేందర్ ఖన్నాకు కూడ ఇస్లామిక్ వ్యవహారాల్లో పట్టుంది. పాకిస్తాన్ , అప్ఘానిస్థాన్ వ్యవహరాల్లో నిపుణుడిగా పేరుంది.
సరైన సమయంలో అనిల్ కుమార్ రా చీఫ్ గా బాద్యతలను స్వీకరించారు. బలూచిస్తాన్, ఆప్ఘనిస్తాన్ వ్యవహారాల్లో క్లిష్టమైన పరిస్థితుల్లోతన నైపుణ్యంతో చక్కబెట్టే పరిస్థితులు ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అందుకే ఆయనను రా చీప్ గా నియమించారని తెలుస్తోంది.అందుకే భారత ప్రభుత్వం ఆయనను ఎంపిక చేసిందని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కాశ్మీర్ వ్యవహారాల్లో పట్టున్న రాజీవ్ ఇంటలిజెన్స్ చీఫ్ గా నియామకం
కేంద్ర ప్రభతు్వం రాజీవ్ జైన్ ను కొత్త ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ గా నియమించింది. జార్ఖండ్ క్యాడర్ కు చెందిన రాజీవ్ జైన్ కాశ్మీర్ వ్యవహారాల్లో పూర్తి పట్టుంది.ఆయన ప్రస్తుతం స్పెషల్ డైరెక్టర్ గా ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. దినేశ్వర్ శర్మ నుండి ఆయన వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేది నుండి బాద్యతలను స్వీకరించనున్నారు.
జైన్ కాశ్మీర్ వ్యవహారాల్లో నిపుణుడుగా పేరుంది. ఆయన ఐబి హెడ్ గా కాశ్మీర్ లో పనిచేసిన అనుభవం ఉంది. కాశ్మీర్ లోయలో ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులున్నాయి. కొంత కాలంగా ఈ ప్రాంతంలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ సమయంలో ఆయనను ఐబి చీఫ్ గా నియమించడంతో కొత్త పంథాలో ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఆయన ప్రయత్నించే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అధికారులు చెబతున్నారు.
ఢిల్లీ, అహ్మదాబాద్ లలో కూడ ఆయన ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ గా పనిచేశాడు. ఆయనకు రాష్ట్రపతి మెడల్ కూడ వచ్చింది.రా చీప్, ఐబి చీప్ గా వీరిద్దరూ రెండేళ్ళపాటు ఆ పదవుల్లో కొనసాగుతారు.












Click it and Unblock the Notifications