షాక్: మొబైల్ ద్వారా డబ్బులు మాయం, ఎలా?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మొబైల్ ద్వారా డబ్బులు మాయం చేసే కొత్త మాల్‌వేర్‌ను భారత్‌లో గుర్తించినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై నివేదిక తెలిపింది.

మొబైల్ మాల్‌వేర్‌వాప్ బిల్లింగ్ చెల్లింపు పద్దతిని టార్గెట్ చేస్తూ బాధితుల మొబైల్ ఖాతాల నుండి వారికి తెలియకుండా డబ్బులు దొంగిలిస్తున్నారని కాస్పర్‌స్కై ల్యాబ్ నిపుణులు కనుగొన్నారు.

New malware in India which steals money through mobile phones: Report

క్సేప్‌కాపీ ట్రోజాన్ అనే మాల్‌వేర్ బ్యాటరీమాస్టర్ వంటి యాప్స్ తరహలో పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని డివైస్‌లోకి వైరస్ కోడ్‌ను లోడ్ చేస్తోంది. యాప్ యాక్టివేట్ కాగానే వైర్‌లెస్ అప్లికేషన్ బిల్లింగ్ వెబ్‌పేజీలపై క్సెప్‌కాపీ మాల్ వేర్ క్లిక్ చేస్తుంది.

ఈ మాల్ వేర్ పలు సర్వీసులకు సబ్‌స్క్రైబ్ చేసి డబ్బులను మాయం చేస్తోంది.ఈ ప్రక్రియలో యూజర్ డెబిట్ కార్డు,క్రెడిట్ కార్డు రిజిష్టర్ చేసుకోవాల్సిన అవసరం కూడ లేదు. యూజర్ నేమ్ పాస్ వర్డ్ కూడ లేదు. దీంతో ఖాతాల నుండి డబ్బులు కట్ అయ్యే వరకు కూడ తెలియదు. ఈ తరహ మాల్‌వేర్ భారత్‌లో అత్యధికంగా ఉందని కాస్పర్‌స్కై నివేదిక తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A new malware Xafecopy Trojan has been detected in India which steals money through victims' mobile phones, cyber security firm Kaspersky said in a report.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి