భారత్‌లో కొత్త రకం మంకీపాక్స్ కలకలం.. WHO హెచ్చరికలతో అలర్ట్!
Mpox New Strain: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ మళ్లీ రూపం మార్చుకుని ఆందోళన కలిగిస్తోంది. భారత్, యూకే దేశాల్లో కొత్త రకానికి చెందిన రీకాంబినెంట్ మంకీపాక్స్ వైరస్ స్ట్రైయిన్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) అధికారికంగా ధ్రువీకరించింది. ఇది గతంలో ఉన్న రెండు వేర్వేరు వైరస్ స్ట్రెయిన్‌ల జన్యు పదార్థాల కలయికతో ఏర్పడిన కొత్త రకమని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు వైరస్ రకాలు సోకినప్పుడు, అవి తమ జన్యువులను మార్చుకుని ఇలాంటి కొత్త 'రీకాంబినెంట్' వైరస్‌లను సృష్టిస్తాయి.
భారత్‌లోనే తొలి ఆనవాళ్లు
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ఈ కొత్త స్ట్రెయిన్ ప్రపంచంలోనే మొదటిసారిగా ఇండియాలోనే వెలుగుచూసింది. 2025 సెప్టెంబర్‌లోనే భారత్‌లో ఈ కేసు నమోదైనట్లు తాజా విశ్లేషణలో తేలింది. బాధితుడు అరేబియా ద్వీపకల్పం నుంచి ప్రయాణించిన చరిత్రను కలిగి ఉన్నాడు. మొదట్లో దీనిని సాధారణ 'క్లాడ్-2' రకానికి చెందినదిగా భావించినప్పటికీ.. అంతర్జాతీయ జన్యు డేటాబేస్‌లోని నమూనాలతో పోల్చిన తర్వాత ఇది బ్రిటన్‌లో దొరికిన అదే ప్రమాదకరమైన రీకాంబినెంట్ స్ట్రెయిన్ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

బ్రిటన్ కేసు.. వైరస్ స్వభావం
బ్రిటన్‌లో ఈ వైరస్ 2025 డిసెంబర్‌లో బయటపడింది. ఆ వ్యక్తి ఆగ్నేయాసియా దేశాల నుంచి ప్రయాణించి వచ్చినట్లు గుర్తించారు. బ్రిటన్ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. ఈ కొత్త వైరస్‌లో అత్యంత వేగంగా వ్యాపించే 'క్లాడ్-1బి', 'క్లాడ్-2బి' స్ట్రెయిన్‌ల లక్షణాలు మిళితమై ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి గుర్తించిన ఇద్దరు రోగులలోనూ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని, ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
వ్యాధి లక్షణాలు, వ్యాప్తి
మంకీపాక్స్ సోకిన వారిలో ప్రధానంగా చర్మంపై దద్దుర్లు, పొక్కులు లేదా నీటి బొబ్బలు రావడం గమనించవచ్చు. వీటితో పాటు తీవ్రమైన జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, విపరీతమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గొంతు లేదా మెడ భాగంలోని శోషరస గ్రంథులు వాపురావడం మంకీపాక్స్ ప్రాథమిక సంకేతం. ఇది ప్రధానంగా సన్నిహిత శారీరక సంబంధాల ద్వారా, సోకిన వ్యక్తి వాడిన పరుపులు, దుస్తులు లేదా ఇతర వస్తువులను తాకడం ద్వారా వ్యాపిస్తుంది.
డబ్ల్యూహెచ్వో హెచ్చరికలు - నిరంతర నిఘా అవసరం
ఈ కొత్త రీకాంబినెంట్ స్ట్రెయిన్ ఎంత వేగంగా వ్యాపిస్తుంది లేదా దీని వల్ల కలిగే ప్రమాదం ఎంత అనే దానిపై ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. సాధారణ ప్రజలకు దీనివల్ల ముప్పు తక్కువగా ఉన్నప్పటికీ.. బహుళ లైంగిక భాగస్వాములు ఉన్నవారు, విదేశీ ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రతి దేశం తమ వద్ద ఉన్న మంకీపాక్స్ నమూనాలను నిశితంగా పరిశీలించాలని, ఏవైనా కొత్త మార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశించింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications