టికెట్ క్యాన్సిల్ చేస్తే పూర్తి డబ్బులు వెనక్కి: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్!
రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే భారీ ఊరటనిచ్చింది. టికెట్ క్యాన్సిలేషన్, రిఫండ్ నిబంధనలలో కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రయాణం రద్దయినప్పుడు టికెట్ రద్దు చేసుకుంటే వచ్చే రిఫండ్ మొత్తాన్ని పెంచుతూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య దశలవారీగా అమలులోకి రానున్న ఈ నిబంధనలు, ప్రయాణికుల జేబుకు చిల్లు పడకుండా అండగా నిలవనున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయల్దేరడానికి 72 గంటల కంటే ముందే కన్ఫార్మ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే, కేవలం నామమాత్రపు ఛార్జీలు మినహాయించి మిగిలిన పూర్తి మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. గతంలో ఉన్న సంక్లిష్టమైన ఛార్జీల విధానానికి స్వస్తి పలుకుతూ, ముందస్తుగా ప్లాన్ మార్చుకునే వారికి ఇది పెద్ద ఊరటగా మారింది.

సమయం తగ్గేకొద్దీ పెనాల్టీ ఇలా..
ప్రయాణ సమయం దగ్గరపడే కొద్దీ క్యాన్సిలేషన్ ఛార్జీలలో మార్పులు ఉంటాయి:
- 72 నుంచి 24 గంటల మధ్య: రైలు బయల్దేరడానికి 72 గంటల నుంచి ఒక రోజు ముందు వరకు టికెట్ రద్దు చేస్తే 'స్టాండర్డ్ పెనాల్టీ' కింద 25 శాతం కట్ చేసుకుని మిగిలిన 75 శాతం రిఫండ్ చేస్తారు.
- 24 నుంచి 8 గంటల మధ్య: ప్రయాణానికి 24 గంటల నుంచి 8 గంటల ముందు రద్దు చేసుకుంటే 'లేట్ క్యాన్సిలేషన్' కింద 50 శాతం మాత్రమే రిఫండ్ లభిస్తుంది.
- 8 గంటల లోపు: రైలు బయల్దేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉంటే లేదా రైలు వెళ్ళిపోయిన తర్వాత రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ లభించదు.
బోర్డింగ్ పాయింట్ మార్పుకు వెసులుబాటు
కేవలం రిఫండ్ మాత్రమే కాకుండా, బోర్డింగ్ పాయింట్ మార్చుకునే విషయంలోనూ రైల్వే శాఖ కనికరించింది. ఇప్పుడు ప్రయాణికులు రైలు బయల్దేరడానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో ఒకటి కంటే ఎక్కువ స్టేషన్లు ఉన్నప్పుడు, ప్రయాణికులకు ఈ సౌకర్యం ఎంతో లాభదాయకం కానుంది. ప్రస్తుతం చార్ట్ తయారయ్యే లోపు మాత్రమే ఈ అవకాశం ఉండగా, ఇకపై 30 నిమిషాల వరకు పొడిగించారు.
పాత పద్ధతికి స్వస్తి
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం, 48 గంటల ముందే టికెట్ రద్దు చేసినా ఏసీ తరగతులకు రూ. 180 నుంచి రూ. 240 వరకు, స్లీపర్ క్లాస్‌కు రూ. 120 వరకు చొప్పున భారీగా వసూలు చేస్తున్నారు. అలాగే 4 గంటల లోపు రద్దు చేస్తే రూపాయి కూడా తిరిగి రావడం లేదు. ఏప్రిల్ 1 నుండి ఈ భారమంతా తగ్గి, కొత్త వెసులుబాటు అందుబాటులోకి రానుంది.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications