వందేభారత్ స్లీపర్,అమృత్ భారత్ రైళ్లలో కీలక మార్పు-రైల్వే బోర్డు ఆదేశాలు..!

మన దేశంలో ప్రస్తుతం ప్రీమియం రైళ్లుగా పరిగణిస్తున్న వందే భారత్ స్లీపర్ (vande bharat sleeper), అమృత్ భారత్ (amrit bharat) రైళ్లపై రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రైళ్లలో ఆర్ఏసీ కోటా ఉండబోదని గతంలో ప్రకటించిన రైల్వే బోర్డు తాజాగా మనసు మార్చుకుంది. ఈ నిర్ణయాన్ని సవరిస్తూ తాజాగా అధికారులకు ఆదేశాలు పంపింది. దీంతో ఇకపై టికెట్ల బుకింగ్ లో ఎమర్జెన్సీ కోటా (Emergency Quota) అమల్లోకి రాబోతోంది.

అమృత్ భారత్ లో ఎమర్జెన్సీ కోటా ఇలా (emergency quota)

రైల్వే బోర్డు తాజా నిర్ణయం ప్రాకంర వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో అత్యవసర కోటాను ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు గత నెలలో తీసుకున్న ఆర్ఏసీ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఏడు లేదా అంతకంటే ఎక్కువ స్లీపర్-క్లాస్ కోచ్‌లు ఉన్న అమృత్ భారత్ రైళ్లలో 24 అత్యవసర బెర్త్‌లు కేటాయిస్తారు. ఈ మేరకు అన్ని రైల్వే జోన్‌లలోని ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లకు రైల్వే బోర్డు ఆదేశాలు పంపింది.

New Rule Emergency Quota Now Available on Vande Bharat Sleeper and Amrit Bharat Trains

వందే భారత్ స్లీపర్ లో కోటా ఇలా

వందే భారత్ స్లీపర్ రైళ్లలో అత్యవసర కోటా కేటాయింపుపైనా రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఫస్ట్ ఏసీ కోచ్ లలో వారం మొత్తం నాలుగు బెర్త్‌లు, వారాంతాల్లో ఆరు బెర్త్‌లు కేటాయిస్తారు. సెకండ్ ఏసీలో వారం మొత్తం 20 బెర్త్‌లు, వారాంతాల్లో 30 బెర్త్‌లు కేటాయిస్తారు. అలాగే థర్డ్ ఏసీలో వారం మొత్తం 24 బెర్త్‌లు, వారాంతాల్లో 42 బెర్త్‌లు కేటాయిస్తారు. ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని అత్యవసర కోటాలను డిమాండ్, బెర్త్ లభ్యత ఆధారంగా కాలానుగుణంగా సమీక్షించవచ్చని కూడా రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చింది.

New Rule Emergency Quota Now Available on Vande Bharat Sleeper and Amrit Bharat Trains

మిగతా కోటాలు ఇలా...

అయితే వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో మహిళలు, వికలాంగులైన ప్రయాణీకులు, సీనియర్ సిటిజన్లు , డ్యూటీ పాస్ హోల్డర్లకు మాత్రమే రిజర్వేషన్ కోటాలు ఉంటాయని, ఇతర కోటాలు వర్తించవని రైల్వే బోర్డు ఇప్పటికే నిర్ణయించింది.కాబట్టి ఆ కోటాల్లో ఎలాంటి మార్పులు లేవు. తాజాగా ప్రారంభించిన ఈ రెండు ప్రీమియం రైళ్లకూ ప్రస్తుతం లభిస్తున్న ఆదరణ, డిమాండ్ల ఆధారంగా రైల్వే బోర్డు తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+