న్యూ ఇయర్ విషాదం: మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

హైదరాబాద్: నూతన సంవత్సరం వేళ హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మెట్రో పిల్లర్‌ను ఢీకొని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

దిల్‌సుఖ్‌నగర్ మెయిన్ రోడ్డుపై సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాజు అతివేగంగా బైక్‌పై వెళ్తూ మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టాడు. బలంగా ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 new year tragedy: a techie killed in road accident in Hyderabad

కొత్త సంవత్సరం వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ తదితర మార్గాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము 5 గంటల వరకు వాహనాల రాకపోకలను నిషేధించారు.

నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, బీఆర్కే భవన్, తెలుగుతల్లి కూడలి, లిబర్టీ జంక్షన్, నల్లగుట్ట రైల్వే స్టేషన్ బ్రిడ్జి వద్ద వాహనాలను దారి మళ్లించారు. బేగంపేట ఫ్లైఓవర్ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేశారు. శుక్రవారం ఉదయం 5 గంటల వరకు అన్ని ఫ్లైఓవర్లపై ఈ నిషేధం అమలు కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+