ఇదేమీ విచిత్రం.. పుట్టిన బిడ్డకు కరోనా.. తల్లికి మాత్రం లేదు...
కరోనా వైరస్ రుపాంతరాలు చెందుతోంది. దీంతో చిత్ర, విచిత్ర కేసులు వస్తున్నాయి. అప్పుడే పాజిటివ్.. నెగటివ్ కూడా వస్తున్నాయి. అయితే ఉత్తర ప్రదేశ్ వారణాసిలో విచిత్రం జరిగింది. పసికందుకు కరోనా సోకింది. ఎలా సోకిందో తెలియడం లేదు. అన్నీ జాగ్రత్తలు తీసుకున్నామని వైద్య సిబ్బంది నెత్తి నోరు మొత్తుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వెంటనే సోకుతోంది. తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన ఓ ఆడ శిశువు కరోనా బారిన పడింది. ఆ శిశువు తల్లికి మాత్రం నెగెటివ్ రావడం ఆశ్చర్యం కలిగించింది. ఇది ఎలా జరిగిందో తెలియక వైద్యులు కూడా షాకవుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఈ ఘటన జరిగింది.

సుప్రియ అనే మహిళ ఈ నెల 24న పురిటి నొప్పులతో వారణాసిలోని బనారస్ హిందూ వర్సిటీ ఆసుపత్రిలో చేరింది. ప్రసవానికి ముందు ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. డెలివరీ తర్వాత ఆమెకు పుట్టిన పాపకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్య సిబ్బందితో పాటు సుప్రియ కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
డెలివరీకి ముందు జరిగిన పరీక్ష ఫలితం తప్పు కావచ్చని అనుకుంటున్నారు. కానీ దీనిపై స్పష్టత లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ జరుగుతోంది. కానీ ఈ విషయం తెలిసిన వారు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేంటి బాబోయ్ అని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications