చుట్టూ కరోనా అలముకున్నా..అదే నిర్లక్ష్యం: దేశంలో లక్షా 37 వేలకు మరణాలు..మరింత పైపైకే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రతలో తగ్గుదల నమోదు కావట్లేదు. ఇదివరకు 30 వేల కంటే దిగువగా నమోదైన కరోనా కేసులు మళ్లీ రోజూ 40 వేలకు పైగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్యలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోజూ 500లకు కాస్త అటు ఇటుగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ వంటి రాష్ట్రాల్లో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. న్యూఢిల్లీ వంటి కొన్ని చోట్ల సెకెంవ్ వేవ్ ప్రభావం నెలకొనడం ప్రభావం జాతీయస్థాయి గణాంకాలపై పడుతున్నాయి. కరోనా పట్ల ఏ మాత్రం పట్టింపు లేకపోవడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

దేశవ్యాప్తంగా కొత్తగా 41,810 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 496 మంది మరణించారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 93,92,920కి చేరుకున్నాయి. ఇందులో 88,02,267 మంది డిశ్చార్జి అయ్యారు. మరణించిన వారి సంఖ్య లక్షా 36 వేలను దాటింది. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 1,36,696 మంది మృతి చెందారు. 24 గంటల్లో కొత్తగా 42,298 మంది కరోనా బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు.

Newly 41810 Covid 19 positive case 496 deaths have been reported in India in last 24 hours

ప్రపంచ దేశాల్లో కరోనా మృతుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతూనే ఉంది. అమెరికా, బ్రెజిల్ తరువాత ఆ స్థాయిలో మరణాలు సంభవించింది భారత్‌లోనే. మరోవంక- దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటిదాకా 13,95,03,803 కోట్ల నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులు వెల్లడించారు. శనివారం ఒక్కరోజే 12,83,449 శాంపిళ్లను పరీక్షించామని, కరోనా మరణాల రేటు 1.5 శాతంగా నమోదైనట్లు తెలిపారు. 93.7 శాతం మేర పేషెంట్లు కోలుకుంటున్నారని చెప్పారు.

Recommended Video

    Delhi Chalo : ఆరు నెలలకు సరిపడా రేషన్ తెచ్చుకున్నాం, తాడో పేడో తేల్చుకునే వెళ్తాం అంటున్న రైతులు

    ఇదివరకు గణనీయంగా తగ్గిన రోజువారీ కరోనా వైరస్ కేసుల మళ్లీ పెరుగుదల బాట పట్టడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం పనికి రాదని సలహా ఇస్తున్నారు. కరోనా వైరస్ మాస్కులను ధరించక తప్పదని స్పష్టం చేస్తున్నారు. చాలాచోట్ల మాస్కులను ధరించకుండా బయట తిరుగుతున్నారని, ఫలితంగా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందనే అంటున్నారు. ఒకరి నిర్లక్ష్యం చాలామందిని ప్రమాదంలో నెట్టేస్తోందని ఐసీఎంఆర్ అధికారులు బాహటంగా వ్యాఖ్యానిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+