నరకం కావాలా..? అయితే నా భర్తను పెళ్లిచేసుకోండి.. చనిపోతూ నవవధువు..
కట్టుకున్న భర్త వేధింపులు భరించలేక ఓ నవ వధువు పాల్పడింది. సూసైడ్ కు ముందు తన భర్త కారణంగా తాను ఎంత మానసిక క్షోభ అనుభవించిందో నోట్ రాసింది. ప్రస్తుతం ఆమె సూసైడ్ నోట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ హృదయవిషాదకరమైన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగింది. సూసైడ్ నోట్ రాసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది ఆ వివాహిత.
అదనపు కట్నం కోసం..
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఇప్పుడు ఓ సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. ఓ నవ వధువు ఈ నోట్ రాసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం తనను భర్త ఎంత వేధించాడో అందులో పేర్కొంది. ఈ ఘటన భోపాల్ లోని కమలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివాహిత నదిలో దూకిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆమెను అత్యంత కష్టంగా బయటకు తీసుకొచ్చారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా అదనపు కట్నం కోసం భర్త పెట్టిన హింస వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. చనిపోయేముందు వాట్సప్ స్టేటస్ లో ఈ విధంగా రాసుకొచ్చింది. "నేను మీకు ఒక్కటే చెప్పదలచుకున్నా. మీ ఆడపిల్లల వివాహ విషయంలో జాగ్రత్త వహించండి. ఆమె జీవితాన్ని నరకంలోకి నెట్టాలంటేనే ఆమెకు వివాహం చేయండి. నరకం కావాలంటే నా భర్త అభిషేక్ ను పెళ్లి చేసుకోండి. అభిషేక్ నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేదు. నీవల్ల నేను ఏడుస్తుంటే.. చూసి రాక్షసానందం పొందావు. ఇది నీకు చెప్పాలని చాలా సార్లు ప్రయత్నించా నువు వినలేదు. వేరే మహిళలతోనూ అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు. మారతావులే అనుకున్నాను. కానీ నువు మారలేదు. నీకు ఒక్కరు కాదు 4-5 గర్ల్ ఫ్రెండ్స్ అవసరం. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను" అని ఆమె రాసుకొచ్చారు.
ఆమె వాట్సప్ స్టేటస్ ఆధారంగా పోలీసులు అభిషేక్ పై కేసు నమోదు చేశారు. అభిషేక్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అదనపు కట్నం వేధింపులే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications