మోడీ కేబినెట్‌లోకి అమిత్ షా... ఆర్థిక శాఖ ఇచ్చే అవకాశముందంటూ ఢిల్లీలో ప్రచారం
రెండో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ కేబినెట్ ఎలా ఉండబోతోందనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు ఎంపీలకు అమిత్ షా నుంచి ఫోన్ వెళ్లింది. మోడీ క్యాబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దంగా ఉండాలంటూ ఆ ఎంపీలకు అమిత్ షా ఫోన్‌లో చెప్పినట్లు సమచారం. అయితే మంత్రుల జాబితాలో అమిత్ షా పేరు కనిపించకపోయినప్పటికీ మోడీ కేబినెట్‌లో ఆయన కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలు చేపడతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక వేళ అమిత్ షా ఆర్థిక శాఖ మంత్రిగా వెళితే బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
కేబినెట్ మంత్రిగా అమిత్ షా ఎంపికవడంపై ఆయన్ను కలిసి శుభాకాంక్షలు చెప్పినట్లు గుజరాత్ బీజేపీ చీఫ్ జీతూ వాఘాని ట్వీట్ చేశారు. అప్పటి వరకు జాబితాలో లేని అమిత్ షా పేరు ఒక్కసారిగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక అప్పటి నుంచి ఢిల్లీలో ఆర్థికశాఖ మంత్రి బాధ్యతలు అమిత్ షాకు ప్రధాని అప్పజెప్పనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మోడీ తొలి క్యాబినెట్‌లో అరుణ్ జైట్లీ ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే తన అనారోగ్యం కారణంగా తాను ఈ సారి మంత్రిగా కొనసాగలేనని జైట్లీ ప్రధానికి వివరించారు. ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు అరుణ్ జైట్లీ. ఆ సమయంలో కొన్ని రోజుల పాటు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టలేకపోయారు. ఈ సమయంలో రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ బాధ్యతలను చేపట్టారు. ఆయనే ఓటాన్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఇక ఆర్థికశాఖ మంత్రిగా పీయూష్ గోయల్ పేరు కూడా వినిపిస్తోంది.
प्रधानमंत्री श्री @narendramodiजी के नेतृत्व में केन्द्रीय मंत्री मंडल में मजबूत साथी के रूप में सामेल होने पर हमारे पर्थदर्शक एवं मार्गदर्शक श्रध्देय श्री @AmitShahजी से शुभेच्छा मुलाकात की और शुभकामनाएं दी। pic.twitter.com/ckzJKEeBA9
— Jitu Vaghani (@jitu_vaghani) May 30, 2019
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications