ఆర్ కే నగర్ ఉప ఎన్నిక: మీడియా vsపోలీసు: రచ్చరచ్చ, పోలింగ్ కేంద్రాల్లోకి నో !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన రాధాకృష్ణ నగర్ (ఆర్ కే నగర్) ఉప ఎన్నికల సందర్బంగా పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రాల్లోకి మీడియా ప్రతినిధులను అనుమతించకపోవడంతో ధర్నా చేస్తున్నారు.
Recommended Video


పోలింగ్ కేంద్రాల్లో
ఆర్ కే నగర్ ఉప ఎన్నికలో ఓట్లు వెయ్యడానికి మహిళలు అధిక సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్ కే నగర్ లోని అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వెయ్యడానికి మహిళలు పెద్ద ఎత్తున క్యూకట్టారు. ఓటరు గుర్తింపు కార్డులు పరిశీలించిన తరువాతే వారిని క్యూలైన్ లోకి పంపిస్తున్నారు.

4 వేల మంది పోలీసులు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా 385 మంది అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఇన్స్ పెక్టర్లు, సబ్ ఇన్స్ పెక్టర్లతో పాటు 3,300 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పోలింగ్ కేంద్రాల్లోకి మీడియా
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల పోలింగ్ సందర్బంగా వివరాలు సేకరించడానికి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు ఆర్ కే నగర్ నియోజక వర్గంలోని పోలింగ్ కేంద్రాల దగ్గరకు వెళ్లారు. ఆ సందర్బంలో కొందరు మీడియా ప్రతినిధులు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు.

మీడియా vsపోలీసు
పోలింగ్ కేంద్రాల్లోకి రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఫోటోలు, వీడియో క్లిప్పింగ్స్ తీసుకుని వస్తామని మీడియా ప్రతినిధులు చెప్పినా పోలీసులు ససేమిరా అన్నారు. ఆ సందర్బంలో మీడియా, పోలీసుల మధ్య పెద్దఎత్తున వాగ్వివాదం జరిగింది.

పోలింగ్ కేంద్రాల ముందు ధర్నా
పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మీడియా ప్రతినిధులు పోలింగ్ కేంద్రాల ముందు ధర్నా చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల కమిషన్ అధికారులు తమకు పాసులు మంజూరు చేసినా పోలీసులు అడ్డుకుంటున్నారని మీడియా ప్రతినిధులు ఆరోపించారు. ఆ సందర్బంలో కొంత సేపు ఓటర్లు బయటే వేచిఉండాల్సి వచ్చింది. అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థి మధుసూదనన్ మీడియా ప్రతినిధులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications