మోడీ హత్యకు కుట్ర: ఎన్ఐఎకి చిక్కిన ఉగ్రవాది
న్యూఢిల్లీ: కర్ణాటకలో అరెస్టయిన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన నజ్ముల్ హుదా తాము గాలిస్తున్న అతి ముఖ్యమైన 20 మంది అనుమానిత ఉగ్రవాదుల్లో ఒకడని బెంగళూరు పోలీసులు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ హత్య చేయాలని కుట్రపన్నిన వారిలో హుదా ఒకడని పోలీసులు అనుమానిస్తున్నారు.
బీహారుకు చెందిన హుదా కుటుంబం గత దశాబ్ద కాలంగా బాజ్పేలో నివసిస్తోంది. నిందితుడి తండ్రి అక్కడి మసీదులో మౌల్వి. హుదా పాలిటెక్నిక్ చదివిన తర్వాత 2011లో ఇంజినీరింగ్‌లో చేరాడు. బెంగళూరులోని ఆర్.వి.ఇంజినీరింగ్ కళాశాలలో రసాయన ఇంజినీరింగ్ చదువుతూ అర్ధంతరంగా నిలిపేశాడు.
హుదాను మంగళూరు నగర శివార్లలోని బాజ్పాలో అరెస్టు చేశారు. మరో నలుగురిని బెంగళూరులో, ఒకరిని తుమకూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ పోలీసులు ఈ నెల మొదటి వారంలో అరెస్టు చేసిన బెంగళూరు వాసి మౌల్వి అన్జర్ షా ఖాసిం అందించిన సమాచారం ఆధారంగా శుక్రవారం వీరిని అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరులో పోలీసు అధికారులు ప్రకటించారు.

ఇందులో ఆసిఫ్, అహద్‌లు బెంగళూరులోని ఫైనన్ మొహల్లాకు చెందినవారు. సుహైల్‌ది కాటన్‌పేట. మహ్మద్ అఫ్జల్ థణిసంద్రకు చెందిన వ్యక్తి. జక్కసంద్రలోని ఒక ఫ్లాట్‌లో మంతనాలు సాగిస్తున్నపుడు ఆ నలుగురినీ అరెస్టు చేశారు.
వారి నుంచి ఎ.కె.47, ఇతర మారణాయుధాలు, భారీగా స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ అన్జర్ బాష ముజీద్‌ను తమకూరులో అరెస్టుచేశారు. సయ్యద్ అన్జర్ బాషాను అల్‌ఖైదా కార్యకర్తగా భావిస్తున్నారు. ఈయన ఎం.ఐ.ఎం. తుమకూరు జిల్లాశాఖ అధ్యక్షుడు కూడా ఉన్నాడు.












Click it and Unblock the Notifications