వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్‌‌కు చెందిన జుబేర్‌పై ఎన్‌ఐఏ చార్జీషీట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు చెందిన అమీర్ జుబేర్‌తో పాటు మరో ఇద్దరిపై ఎన్ఐఏ గురువారం నాడు చార్జీషీటు దాఖలు చేసింది. నకిలీ కరెన్సీ ద్వారా ఇండియా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో వీరిపై ఎన్ఐఏ చార్జీషీటు దాఖలు చేసింది.

ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిఎస్ఎస్ పిళ్ళై చార్జీషీటును ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జీషీటును ధాఖలు చేశారు.పాకిస్థాన్‌కు చెందిన జుబేర్ శ్రీలంకలో నివాసం ఉంటున్నారు. ఇండియాలో తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడని ఆ ఛార్జీషీటులో ఎన్ఐఏ పేర్కొంది.

NIA chargesheets Pakistan diplomat

2012లో అన్సారీ అనే వ్యక్తిని సిఐడికి చెందిన క్యూ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అన్సారీని విచారించిన సమయంలో జుబేర్ పేరు వెలుగు చూసింది.జూబేర్ మరో వ్యక్తి అన్సారీని నియమించినట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

తంజావూర్ కు చెందిన అన్సారీ ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలను విక్రయించే వ్యాపారం చేసేవాడు. అయితే ఈ వ్యాపారంలో అన్సారీ తీవ్రంగా నష్టపోయాడు.ఈ నష్టం నుండి కాపాడుతామని జుబేర్ మరో వ్యక్తి నమ్మించి దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలను పెంపొందించేందుకు సహకరించాలని కోరారు. అంతేకాదు నకిలీ కరెన్సీని చలామణి చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని పన్నాగం పన్నారని ఎన్ఐఏ చార్జీషీటులో పేర్కొంది.

ఆర్మీకి చెందిన వారితో స్నేహం చేయాలని జుబేర్ నుండి అన్సారీకి ఆదేశాలు అందాయి. అంతేకాదు ఆర్మీకి చెందిన కీలకమైన ఫోటోలను జుబేర్ కు అందించాలని ఆదేశించారు. ఈ పనిలో ఉండగానే 2012 తిరుచ్చిలో అన్సారీ అరెస్ట్ అయ్యారు. శ్రీలంకలో ఉన్న జుబేర్‌కు ఇండియాకు చెందిన కీలక సమాచారాన్ని అందించేందుకు వెళ్తుండగా తిరుచ్చిలో పోలీసులు అరెస్ట్ చేశారు.

శ్రీలంకకు చెందిన సెల్వరాజ్‌ను సిద్దిఖీ ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాల నెట్ వర్క్ కోసం నియమించుకొన్నాడు. దేశంలో కుట్రలు పన్నేందుకు సిద్దిఖీ నుండి సెల్వరాజ్ కు నిధులు అందేవి.2014 సెప్టెంబర్‌లో సెల్వరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
The National Investigation Agency (NIA) on Thursday filed a chargesheet against Amir Zubair Siddiqui, a Pakistan diplomat, and two other co-conspirators for circulating high quality Fake Indian Currency Notes (FICN) with the objective of destabilising India’s economy and waging a war against the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X