'పఠాన్‌కోట్' దర్యాఫ్తు బృందంలోని ఎన్ఐఏ ఆఫీసర్ కాల్చివేత, ఫ్యామిలీ ముందే..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ దర్యాఫ్తు అధికారిని కాల్చి చంపారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. యూపీలోని బిజ్నూర్‌లో ఎన్ఐఏ అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఎన్‌ఐఏ డిప్యూటీ ఎస్పీ మహమ్మద్ తంజీమ్ దంపతుల పైన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
కాల్పుల్లో తంజీమ్ మృతి చెందారు. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని భార్య, పిల్లల ముందే దుండగులు కాల్చి చంపారు. అతను భార్యా, పిల్లలతో ఓ వివాహానికి వెళ్లి వస్తుండగా బిజ్నూరు సమీపంలో ఈ కాల్పులు జరిగాయి.

తంజీమ్ అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని భార్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. మరో విషయమేమంటే పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ పైన ఉగ్రవాదులు దాడి చేసిన ఘటన పైన దర్యాఫ్తు చేస్తున్న ఎన్ఐఏ బృందంలో మహమ్మద్ తంజీమ్ ఉన్నారు.












Click it and Unblock the Notifications