రామేశ్వరం కేఫ్ కేసులో ఫస్ట్ వికెట్, ఆంధ్రా బార్డర్ లో ఏం చేస్తున్నాడంటే?, సీసీటీవీ కెమెరాలో!
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో ఐఈడీ పేలుడు కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసినట్లు సమాచారం. షబ్బీర్‌గా గుర్తించిన నిందితుడిని బళ్లారి జిల్లాలో అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ వర్గాలను ఉటంకిస్తూ ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. నిందితుడు షబ్బీర్ ని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.
మార్చి 3వ తేదీన ఎన్‌ఐఏ బృందం బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడు స్థలాన్ని సందర్శించిన తర్వాత ఆ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. ఈ నెల ప్రారంభంలో బెంగళూరు నగరంలోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించి 10 మంది గాయపడ్డారు. పేలుడు జరిగిన రోజు రామేశ్వరం కేఫ్ సమీపంలోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో కనిపించిన ప్రధాన నిందితుడు షబ్బీర్ సహచరుడు అని పోలీసు వర్గాలు తెలిపాయి.

బాంబు పేలుడు గురించి సమాచారం ఇస్తే రూ 10 లక్షల రివార్డు ఇస్తామని ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి బాంబర్ గురించి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రూపాయల రివార్డును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రకటించింది. నిందితుల గురించి సమాచారం ఇచ్చేవారి గుర్తింపు గోప్యంగా ఉంచబడుతుందని ఎన్ఐఏ హామీ ఇప్పటికే హామీ కూడా ఇచ్చింది.
బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్‌లో బ్యాగ్‌ని వదిలి వెళ్లిన వ్యక్తి సీసీటీవీ కెమెరా ఫుటేజీలో చిక్కుకున్న బాంబర్ చిత్రాన్ని కూడా ఏజెన్సీ విడుదల చేసింది. ఎన్ఐఏ అధికారులు విడుదల చేసిన చిత్రంలో బాంబర్ తలకు క్యాప్, నల్ల ప్యాంటు, నల్ల బూట్లు ధరించి ఉన్నాడు. మార్చి 1వ తేదీన మధ్యాహ్నం రామేశ్వరం కేఫ్ లో రద్దీగా ఉండే సమయంలో బాంబు పేలుడు సంభవించింది.

సీసీటీవీ కెమెరా ఫుటేజీలో లోపల బ్యాగ్‌ను ఉంచిన నిందితుడిని పోలీసులు ట్రాక్ చేశారు. రామేశ్వరం కేఫ్ లో పేలుడుకు టైమర్‌తో కూడిన IED పరికరాన్ని ఉపయోగించినట్లు పోలీసులు, ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది. బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఇప్పటికే జైల్లో ఉన్న ఓ నిందితుడిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
బెంగళూరు రామేశ్వరం కేఫ్ కేసు విషయంలో అధికారులు పక్కా సమాచారం బయటకు లాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా అయిన బళ్లారిలో నిందితుడు మకాం వేశాడని అధికారులకు పక్కా సమాచారం అందడంతో అతన్ని పట్టుకున్నారని తెలిసింది. ఇంకా ఈ కేసులో ఎంత మందికి లింక్ ఉంది అంటూ ఎన్ఐఏ అధికారులు పిన్ టూ పిన్ బయటకు లాగుతున్నారు.












Click it and Unblock the Notifications