Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుక్కర్ బాంబు కథ వెనుక పెద్ద ప్లాన్ ఉంది, గుడి పేల్చేసి ఐసిస్ లో చేరి?, కథ అడ్డం తిరిగింది!

కర్ణాటకలోని మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు (జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక కోర్టుకు చార్జిషీటును సమర్పించినట్లు సమాచారం. షరీక్, సయ్యద్ యాసీన్‌లపై విచారణ చేసిన ఎన్ఐఏ అధికారులు కోర్టులో ఛార్జిషీట్ సమర్పించారనితెలిసింది. అనుమానిత ఉగ్రవాదులు కుక్కర్‌లో బాంబుతో గుడిని పేల్చాలని ప్లాన్ చేశారని వెలుగు చూసింది.

ఆటోలో కుక్కర్ బాంబు తీసుకుని వెళ్లి మంగళూరులోని కద్రి మంజునాథ్ స్వామి ఆలయాన్ని పేల్చివేసేందుకు ఆటోలో వెళ్లారని, అయితే కుక్కర్ బాంబు మార్గం మద్యలోనే పేలిందని అధికారుల విచారణలో వెలుగు చూసిందని సమాచారం. కుక్కర్ బాంబుల తయారీకి సయ్యద్ యాసిన్ పేలుడు పదార్థాలను షరీక్ కు సరఫరా చేశాడు. ఆలయంలో కుక్కర్ బాంబు పేలుడు నిర్వహించిన తర్వాత మహ్మద్ షరీక్ ఐఎస్‌ఐఎస్‌లో (ఐసీస్) చేరాలని నిర్ణయించుకున్నట్లు ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

NIA officials presented charge sheet in special court in Mangaluru cooker bomb blast case

మంగళూరులో వాల్ రైటింగ్ కేసు, శివమొగ్గ ట్రయల్ బాంబ్ కేసులో షరీక్ ప్రమేయం ఉన్నట్లు కూడా అధికారుల విచారణలో బయటకు తెలిసింది. ఈ కుక్కర్‌ బాంబు పేలుడు ఉదంతం కొనసాగుతుండగా మరిన్ని భయానక వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. మంగళూరులోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన కద్రి మంజునాథ దేవాలయంపై కూడా నిందితులు బాంబులతో దాడి చేసి సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

దీని ద్వారా ప్రపంచాన్ని ఇస్లామీకరణ చెయ్యాలని నిందితుల ప్రధాన ఉద్దేశం అని, అయితే మంగళూరులో మార్గమధ్యలో ఈ కుక్కర్ బాంబు పేలిపోయిందని అధికారులు చెబుతున్నారు. 2022 నవంబర్ 19వ తేదీన మంగళూరులో పేలిన కుక్కర్ బాంబు రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. మంగళూరులో మహ్మద్ షరీక్ తీసుకొచ్చిన కుక్కర్ బాంబు అనుకోకండా ఆటోలో పేలిపోవడంతో అతను ఆసుపత్రిలో చేరాడు.

NIA officials presented charge sheet in special court in Mangaluru cooker bomb blast case

ఈ కుక్కర్ బాంబు పేలుడు ఘటనతో కర్ణాటక రాష్ట్రంలో ఐఎస్‌ఐఎస్‌ ఓ మోడల్‌ యాక్ట్‌ను ప్లాన్‌ చేస్తోందని అధికారుల విచారణలో తేలింది. అలాగే అనుమానిత ఉగ్రవాది మజ్ మునీర్ అహ్మద్‌ను శివమొగ్గలో అరెస్టు చేయగా ఆ సందర్బంలో షరీక్ అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని పారిపోయి మంగళూరు, మైసూర్, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో తిరిగాడని వెలుగు చూసింది.

హిందువుగా వేషం వేసుకున్న మోహ్మద్ షరీక్ మైసూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడి నుంచి హింసాత్మక చర్యను కొనసాగించినట్లు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ కేసు దర్యాప్తులో మోహ్మద్ షరీక్, సయ్యద్ యాసిన్ లకు సంబంధించి ఇంకా సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం మీద ఎన్ఐఏ అధికారులతో మంగళూరు కుక్కర్ బాంబు నిందితుడు షరీక్ బండారం మొత్తం బయటకు వస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+