బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

NIA: పాక్, ISISతో లింక్, కేరళ, కర్ణాటక, ఢిల్లీలో దాడులు, కుష్కా కక్కిస్తున్నారు, ఆల్ ఔట్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ కొచ్చి/ ముంబాయి: ఇస్లామిక్ స్టేట్ (ISIS), పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో టచ్ లో ఉన్నారని పక్కా సమాచారం అందడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు న్యూఢిల్లీ, కర్ణాటక, కేరళలో ఏకకాలంలో మెరుపుదాడులు చేశారు. ఉగ్రవాదులతో లింక్ ఉందని పక్కా సమాచారం అందడంతో ఐదు మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని ఉదయం వాళ్లు తిన్న మసాలా దోసె, నిన్న రాత్రి తిన్న కుష్కా కక్కిస్తున్నారు. ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు పంజా విసరడంతో ఉగ్రవాదులతో లింక్ ఉన్న కాలాంతకులు హడలిపోయారు.

Tiktok star: ఆంటీలను చూస్తే సోల్లు కార్చుకున్నారు, సుమా మేడమ్ వన్స్ మోర్, ఓ సారి!Tiktok star: ఆంటీలను చూస్తే సోల్లు కార్చుకున్నారు, సుమా మేడమ్ వన్స్ మోర్, ఓ సారి!

ఉగ్రవాదులతో ఆన్ లైన్ లింక్

ఉగ్రవాదులతో ఆన్ లైన్ లింక్

ఉగ్రవాదులతో ఆన్ లైన్ లో టచ్ లో ఉంటూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు సమాచారం అందింది. ఇదే సమయంలో ఉగ్రవాదులతో కేరళ, కర్ణాటక, న్యూఢిల్లీకి చెందిన కొందరికి లింక్ ఉందని ఇంటెలిజెన్స్ విభాగం అధికారులకు సమాచారం అందింది.

48 గంటల ముందే అలర్ట్

48 గంటల ముందే అలర్ట్

ఉగ్రవాదుల సానుభూతిపరుల కదలికలపై 48 గంటల ముందే ఎన్ఐఏ అధికారులు ఈ విషయంపై కేసు నమోదు చేసి అలర్ట్ అయ్యారు. కర్ణాటక, కేరళ, న్యూఢిల్లీ ప్రాంతాలపై ఎన్ఐఏ అధికారులు నిఘా వేశారు. ఆన్ లైన్ లో ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్న వారి కదలికలపై సుమారు 48 గంటలు అధికారులు గట్టి నిఘా వేశారు.

ఒకేసారి మసాలా దోసె, కుష్కా

ఒకేసారి మసాలా దోసె, కుష్కా

సోమవారం న్యూఢిల్లీలోని జఫరాబాద్ లోని రెండు ప్రాంతాలు, ఐటీబీటీ సంస్థల రాజధాని బెంగళూరు సిటీలో, కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో, కేరళలోని కొచ్చి, కన్నూర్ లోని పలు ప్రాంతాల్లో ఒకేసారి ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. ఉగ్రవాదులతో లింక్ ఉందని వెలుగు చూడటంతో ఐదు మందిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు వాళ్లు ఆదివారం రాత్రి తిన్న కుష్కా, సోమవారం ఉదయం తిన్న మసాల దోసెలను కక్కిస్తున్నారు.

ISIS, పాకిస్థాన్ ఉగ్రవాదులతో లింక్?

ISIS, పాకిస్థాన్ ఉగ్రవాదులతో లింక్?

కర్ణాటక, కేరళ, న్యూఢిల్లీలో నివాసం ఉంటున్న కొందరు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్), పాకిస్థాన్ కు చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలతో లింక్ పెట్టుకుని నిత్యం ఆన్ లైన్ లో ఆ ఉగ్రవాదులతో లింక్ పెట్టుకుని భారతదేశంలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడానికి స్కెచ్ వేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. ఎన్ఐఏ అధికారుల అదుపులోకి తీసుకున్న ఐదు మంది పేర్లు బయటకు రాకుండా వారి పై అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

English summary
The National Investigation Agency (NIA) on Monday conducted raids at several locations across Karnataka, Delhi and Kerala in a major crackdown on Islamic State (ISIS) modules, said sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X