మళ్లీ వచ్చిన రాత్రి పూట కర్ఫ్యూ: ఆ రాష్ట్రాలు, సమయం, తేదీ వివరాలు ఇదిగో..

ఒమిక్రాన్ టెన్షన్‌తో నైట్ కర్ఫ్యూ వచ్చేసింది. చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ప్యూను ప్రకటించాయి. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా వస్తున్నాయి. దీంతో కర్ఫ్యూ తప్ప మరో మార్గం లేదు. సమ్మర్‌లో లాక్ డౌన్ విధిస్తూ.. కేసులు తగ్గించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి వింటర్‌లోనే లాక్ డౌన్ లాంటి సిచుయేషన్ వస్తోంది.

ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ జాబితాలో ఢిల్లీ కూడా చేరింది. కొద్ది రోజులుగా దేశ రాజధానిలో ఓ వైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది. ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆదివారం ఆప్ సర్కార్ ప్రకటించింది. సోమవారం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది.

కర్ణాటక కూడా రాత్రి పూట కర్ఫ్యూ స్టార్ట్ చేసింది. 28వ తేదీ నుంచి 10 రోజులు ఉండనుంది. రాత్రి 10 గంటల నుంచి స్టార్ట్ అవనుంది. ఆ సమయంలో రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.

 Night curfews are back: States impose curbs to counter Omicron threat

అసోంలో రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు రాలేదు. యూపీలో రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు.. హర్యానాలో కూడా ఇదే విధంగా ఉండనుంది. మధ్యప్రదేశ్ కూడా ఇదే సమయం ఉండనుంది.

గుజరాత్‌లో గల అహ్మదాబాద్, సూరత్, రాజ్ కోట్, వడొదర, జునాఘడ్, జామ్ నగర్, భావ్ నగర్, గాంధీనగర్‌లో అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది. మహారాష్ట్ర కరోనా కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

అన్నీ రాష్ట్రాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధించాయి. ఇటు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+