అమ్మాయిలు రాత్రి బయట తిరగడం: కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్య
న్యూఢిల్లీ: అమ్మాయిలు అర్ధరాత్రి ఒంటరిగా బయటకు వెళ్లడం, మేల్కొని ఉండటం మన సంస్కృతీ, సంప్రదాయాలకు విరుద్ధమని కేంద్రమంత్రి మహేష్ శర్మ వ్యాఖ్యానించారు. ఆయన ఓ చానల్ కు ల ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆడపిల్లలు రాత్రుళ్లు స్వేచ్ఛగా బయట తిరగడం విదేశాలలో చెల్లుతుందన్నారు. మన దేశంలో మాత్రం అది సంప్రదాయం కాదన్నారు. అయితే, ఈ ప్రకటన వివాదాస్పదం కావడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

తన కుమార్తె కూడా డాక్టర్ అని, ఆమె కూడా రాత్రుళ్లు సినిమాలకు వెళ్తుందని మహేష్ శర్మ చెప్పారు. భారతీయ, ఐరోపా సంస్కృతులు భిన్నమైనవని మాత్రమే తాను చెప్పానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications