రాంచీలో 9బాంబులు స్వాధీనం: లాడ్జిరూంలో కాలేజ్ గర్ల్
పాట్నా: జార్ఖండ్ పోలీసుల అప్రమత్తతతో బాంబు పేలుళ్ల ముప్పు తప్పింది. రాంచిలో తొమ్మిది బాంబులను స్వాధీనం చేసుకున్నారు. రాజధానిలోని హిండిపిడి ప్రాంతంలో సోమవారం తనిఖీలు చేపట్టగా ఇవి బయటపడ్డాయని ఎస్పీ సాకేత్ కుమార్ సింగ్ తెలిపారు.
పాట్నాలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఉపయోగించిన బాంబుల మాదిరిగానే ఇవి ఉన్నాయన్నారు. అదే విధంగా 9 జిలెటిన్ స్టిక్స్, గడియారాలు అమర్చిన మరో రెండు బాంబులనూ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

కాగా, రాంచీలో పట్టుబడిన తొమ్మిది బాంబులను పోలీసులు ఓ లాడ్జి నుండి స్వాధీనం చేసుకున్నారు. ఈ లాడ్జిలో ఓ యువతి ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఆమె ఉంటున్న గది నుండే పోలీసులు బాంబులను గుర్తించారు. ఆమె ఓ ప్రయివేటు కళాశాలకు చెందిన విద్యార్థిని. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications