గోరఖ్‌పూర్‌లో 105కి చేరిన పిల్లల మరణాలు.. ఆసుపత్రికి వెళ్లనున్న రాహుల్ గాంధీ, సీఎం యోగి

గోరఖ్‌పూర్‌: ఉత్తరప్రదేశ్ బాబా రాఘవ దాస్ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో పిల్లల మరణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో మరో 9 మంది చిన్నారులు చనిపోవటంతో ఆ సంఖ్య 105కి చేరుకుంది. ఈ విషయాన్ని డాక్టర్‌ పీకే సింగ్‌ ధృవీకరించారు.

నియోనాటల్ వార్డులో ఐదుగురు, ఏన్కెఫలైటిస్ వార్డులో ఇద్దరు, సాధారణ వార్డులో ఇద్దరు చనిపోయినట్లు ఆయన వెల్లడించారు. చనిపోయిన వారిలో చాలా మంది నవజాత శిశువులు ఉన్నారని, అత్యవసర స్థితిలోనే వారిని తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొచ్చారని సింగ్ తెలిపారు.

ఆగస్టు 10 నుంచి ఆగస్టు 11వ వరకు.. ఆ 48 గంటల్లోనే 30 మంది పిల్లలు ఆక్సిజన్ అందక చనిపోయారంటూ జిల్లా మెజిస్ట్రేట్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కోన్నారు.

 Nine more children die in Gorakhpur’s BRD Medical College, toll at 105

మరోవైపు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం యూపీకి వెళ్లనున్నారు. బీఆర్డీ ఆసుపత్రిని కూడా ఆయన సందర్శించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఇంకోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌ లో స్వచ్ఛ్‌భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయన కూడా ఆసుపత్రిని సందర్శించి.. పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉందని సీఎంవో అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+