CJI NV Ramana: 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం: జస్టిస్ హిమ కోహ్లీ సహా

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానానికి కొత్తగా ఎంపికైన తొమ్మిదిమంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ హిమ కోహ్లీ వారిలో ఒకరు. కొద్ది సేపటి కిందటే సుప్రీంకోర్టులో నిరాడంబరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారంతా ప్రమాణ స్వీకారం చేశారు.

 యధాతథంగా ఆమోదం..

యధాతథంగా ఆమోదం..

సుప్రీంకోర్టులో ఇప్పటిదాకా తొమ్మిది న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటన్నింటినీ భర్తీ చేయడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని అయిదుమంది సభ్యులు గల సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవలే ఈ తొమ్మిది మంది పేర్లను సిఫారసు చేసిింది. కేంద్రానికి పంపించింది. కొలీజియం చేసిన సిఫారసుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా.. ఆ జాబితాను యధాతథంగా ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. దీనితో వారందరూ సుప్రీంకోర్టుకు ఎంపికయ్యారు.

తొమ్మిదిమంది వీరే..

తొమ్మిదిమంది వీరే..

ప్రమాణ స్వీకారం చేసిన వారిలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది ఉన్నారు. వారితో పాటు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభయ్ శ్రీనివాస్ ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీటీ రవికుమార్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేష్ ఉన్నారు.

సీనియర్ అడ్వొకేట్‌ నరసింహ బార్ కోసం..

సీనియర్ అడ్వొకేట్‌ నరసింహ బార్ కోసం..

బార్ కోసం సీనియర్ అడ్వొకేట్ పీఎస్ నరసింహ‌ను సుప్రీంకోర్టు కొలీజియం రికమెండ్ చేసింది. ఈ తొమ్మిది మందిలో జస్టిస్ బీవీ నాగరత్నతో పాటు జస్టిస్ విక్రమ్ నాథ్, సీనియర్ అడ్వొకేట్ పీఎస్ నరసింహ‌లకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉండే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ జాబితాను ఆమోదించడతో సీనియర్ అడ్వొకేట్ పీఎస్ నరసింహ నేరుగా సుప్రీంకోర్టు బార్‌కు నామినేట్ అయిన తొమ్మిదో న్యాయవాది అయ్యారు.

జస్టిస్ విక్రమ్ నాథ్..

కొద్దిసేపటి కిందటే- సీజేఐ ఎన్వీ రమణ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత- అభయ్ శ్రీనివాస్ ఓకా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పదవీకాలం 2025 మే 25వ తేదీన ముగుస్తుంది. ఆయన మాతృ న్యాయస్థానం.. బోంబే హైకోర్టు. ఆ తరువాత జస్టిస్ విక్రమ్ నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పేరెంట్ కోర్టు.. అలహాబాద్ హైకోర్టు. ఆయన పదవీ కాలం 2027లో ముగుస్తుంది. సీనియారిటీ ప్రకారం.. విక్రమ్ నాథ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది.

 జస్టిస్ జేకే మహేశ్వరి..

జస్టిస్ జేకే మహేశ్వరి..

విక్రమ్ నాథ్ తరువాత.. జస్టిస్ జేకే మహేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మాతృ న్యాయస్థానం మధ్య ప్రదేశ్ హైకోర్టు. ఇదివరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు జేకే మహేశ్వరి. అనంతరం ఆయన అదే హోదాలో సిక్కిం హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2026 జూన్ 29వ తేదీ వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. అనంతరం జస్టిస్ హిమ కోహ్లీ ప్రమాణం చేశారు. ఆమె మాతృ న్యాయస్థానం ఢిల్లీ హైకోర్టు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. అనంతరం సుప్రీంకోర్టుకు నామినేట్ అయ్యారు. 2024 సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఆమె పదవిలో కొనసాగుతారు.

జస్టిస్ బీవీ నాగరత్న

జస్టిస్ బీవీ నాగరత్న

జస్టిస్ హిమ కోహ్లీ తరువాత జస్టిస్ బీవీ నాగరత్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక హైకోర్టు నుంచి ఆమె సుప్రీంకోర్టుకు ఎలివేట్ అయ్యారు. 2027 వరకు ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉంటారు. అత్యంత సీనియర్ కావడం వల్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే- దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టిస్తారు.

జస్టిస్ సీటీ రవికుమార్..

అనంతరం జస్టిస్ సీటీ రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ హైకోర్టు నుంచి ఆయన నామినేట్ అయ్యారు. ఆయన పదవీ కాలం 2025 జనవరి 6వ తేదీ వరకు ఉంది. ఆయన తరువాత జస్టిస్ ఎంఎం సుందరేష్ ప్రమాణం చేశారు. మద్రాస్ హైకోర్టు నుంచి ఆయన నామినేట్ అయ్యారు. 2027 జులై 21వ తేదీ వరకు ఆయన ఆ హోదాలో కొనసాగుతారు. అనంతరం జస్టిస్ బేలా ఎం త్రివేది సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2025 జూన్ 10వ తేదీన ఆమె పదవీ విరమణ చేస్తారు. జ్యుడీషియల్ బ్యాక్‌గ్రౌండ్ సర్వీస్ నుంచి సుప్రీంకోర్టుకు నామినేట్ అయిన ఏకైక మహిళా న్యాయమూర్తి ఆమె.

 జస్టిస్ పీఎస్ నరసింహ..

జస్టిస్ పీఎస్ నరసింహ..

అనంతరం జస్టిస్ పీఎస్ నరసింహ న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. బార్ నుంచి ఆయనను నేరుగా సుప్రీంకోర్టుకు నామినేట్ చేశారు. కాగా- సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడిగా కొనసాగిన న్యాయమూర్తి జస్టిస్ రోహిన్టన్ నారిమన్ రిటైర్‌మెంట్ తరువాత ఎంపిక చేసిన తొలి జాబితా ఇదే. 2019 నుంచి కొలీజియం సభ్యుడిగా కొనసాగారు రోహిన్టన్ నారిమన్.. ఈ నెల 12వ తేదీన ఆయన పదవీ విరమణ చేశారు. నారిమన్ స్థానంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర రావు కొలీజియంలో సభ్యుడయ్యారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ఈ అయిదుమంది సభ్యులు గల కొలీజియంలో జస్టిస్ యుయు లలిత్, ఎఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూద్, లావు నాగేశ్వర రావు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+