వాస్తు చెబుతున్న షాకింగ్ నిజం..దేవుడికి నిలబడి దణ్ణం పెట్టుకుంటున్నారా?
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఉరుకుల పరుగుల జీవితం. కాంక్రీట్ జంగిల్‌ను తలపించే నేటి నగరాల్లో చిన్న చిన్న ఫ్లాట్లలో నివసించే వారి సంఖ్య పెరిగిపోయింది. స్థలాభావం వల్ల దేవుడి కోసం ప్రత్యేకంగా గదిని కేటాయించలేక.. గోడకో చిన్న చెక్క మందిరాన్ని తగిలించేస్తున్నారు. ఇక ఆఫీసులకు వెళ్లే తొందరలో ఆ మందిరం ముందే నిలబడి, అలా అగరుబత్తీలు తిప్పేసి దణ్ణం పెట్టేసి పరుగులు తీస్తున్నారు. అయితే, ఇలా నిలబడి చేసే పూజల వల్ల పుణ్యం రాకపోగా.. తీవ్ర నష్టాలు జరుగుతాయనే షాకింగ్ నిజం మీకు తెలుసా?
నిలబడి పూజ చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ!
ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణులంతా చెబుతున్నదేమిటంటే.. దేవుడిని ఆరాధించే పద్ధతిలో లోపాలు ఉంటే లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. వాస్తు, పర్యావరణ శాస్త్రాల ప్రకారం గోడకు ఉన్న మందిరం ముందు నిలబడి పూజ చేయడం చాలా అశుభ పరిణామం. ఇది ఇంట్లోని సానుకూల శక్తి ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల కుటుంబంలో ఊహించని సమస్యలు, మనశ్శాంతి కరువడం వంటివి జరుగుతాయి.

పరిష్కారం ఏంటి? సనాతన ధర్మం ఏం చెబుతోంది?
ఈ సమస్యకు శాస్త్రం ఒకే ఒక్క స్పష్టమైన పరిష్కారాన్ని సూచించింది. నేలపై ఒక పవిత్రమైన ఆసనం వేసుకుని, దానిపై ప్రశాంతంగా కూర్చుని పూజ చేయడంలోనే అసలైన ఆధ్యాత్మిక ప్రయోజనం దాగి ఉంది. ఆసనంపై కూర్చుని దైవాన్ని ఆరాధించడమే సనాతన ధర్మంలోని ప్రధాన సూత్రం. ఇలా కూర్చోవడం వల్ల మనసు దేవుడిపై లగ్నమవుతుంది. అక్కడ ఒక శక్తివంతమైన సానుకూల వలయం ఏర్పడి, ఇంట్లో గూడుకట్టుకున్న ప్రతికూల శక్తులన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
దీపం, అగరుబత్తీలు ఏ వైపు ఉండాలి?
కూర్చునే విధానంతో పాటు పూజా గదిలో దిశలకు, వస్తువులు ఉంచే స్థానాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. దేవుడిని ఆరాధించేటప్పుడు భక్తులు ఎల్లప్పుడూ తూర్పు వైపు ముఖం చేసి కూర్చోవాలి. సూర్యోదయం జరిగే తూర్పు దిక్కు నూతన శక్తికి, చైతన్యానికి ప్రతీక. అగరుబత్తులు, దీపాలు, పూజా గంట లాంటి అగ్ని, వాయు తత్వాలకు సంబంధించిన వస్తువులను ఎల్లప్పుడూ పూజ చేసేవారికి కుడి వైపున ఉంచాలి. పండ్లు, పూలు, నైవేద్యం, నీళ్ల పాత్ర, శంఖం లాంటివి ఎల్లప్పుడూ ఎడమ వైపున పెట్టుకోవాలి. కేవలం భక్తి ఉంటే సరిపోదు.. దానికి శాస్త్ర నియమాలు తోడైనప్పుడే ఆ పూజకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది. కాబట్టి, ఇకపై నిలబడి కాకుండా, కాసేపు ఆసనంపై ప్రశాంతంగా కూర్చుని, సరైన దిశల్లో పూజా సామాగ్రిని ఉంచి దైవాన్ని ఆరాధించండి.. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి!












Click it and Unblock the Notifications