9ఏళ్ల బాలికపై రేప్: తీవ్ర రక్తస్రావంతో మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్ పట్టణం షకారిపుకుర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న తొమ్మిదేళ్ల బాలికపై పొరుగున ఉండే 27ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడడంతో ఆమె మృతి చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం బాలిక తల్లిదండ్రులు వారి మరో కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఇంట్లో తొమ్మిదేళ్ల బాలిక ఒంటరిగా ఉంది. ఇది గమనించి పొరుగున ఉండే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి కుక్క మొరుగుతూ ఉండటంతో పరుగు పరుగున తమ కూతురు కోసం వెతకగా ఇంటి వెనుక స్థలంలో రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.
కుమార్తె మృతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications