How dare you: ఇందిరాపై నిర్భయ పేరెంట్స్ ఫైర్, దోషులను క్షమించలేరా కామెంట్లపై ధ్వజం
నిర్భయ దోషులపై ఆశాదేవి క్షమించలేరా అని ప్రముఖ న్యాయవాది ఇందిరా జై సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇందిరా కామెంట్లపై నిర్భయ తల్లి ఆశాదేవి ఒంటికాలిపై లేచారు. తమకు సలహాలు ఇవ్వడానికి ఇందిరా ఎవరు..? ఆమె ఇంత ధైర్యం చేసి మాట్లాడుతుందని ఊహించలేదని ఆశాదేవి అన్నారు.

సోనియాతో పోలిక
అంతేకాదు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాదిరిగా ప్రవర్తించలేరా అని అడిగారు. రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి నళినికి ఉరిశిక్ష వద్దని సోనియాగాంధీ చాలాసార్లు చెప్పారని గుర్తుచేశారు. సోనియాను ఆదర్శంగా ఆశాదేవి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఆశాదేవి స్పందిస్తూ.. ఇలాంటి వారి వల్లే లైంగికదాడి చేసిన దోషులకు శిక్ష పడటం లేదని ఘాటుగా విమర్శించారు.
Recommended Video

వింత వాదన...?
నిర్భయ ఘటనపై యావత్ దేశం స్పందించింది. దోషులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. కానీ ఇందిరా జై సింగ్ మాత్రం వింత వాదనను తెరపైకి తీసుకొచ్చారు అని మండిపడ్డారు. తాను ఇదివరకు సుప్రీంకోర్టులో ఇందిరా జై సింగ్‌ను కలిశానని గుర్తుచేశారు. ఆ సమయంలో తమకు మద్దతుగా మాట్లాడారని చెప్పారు. కానీ ఇవాళ దోషులకు వకాల్తా పుచ్చుకోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అలాంటి వారు రేపిస్టులకు సంబంధించిన కేసుల వల్లే జీవనోపాధి పొందుతున్నారని అర్థమవుతోంది, ఇక దేశంలో లైంగికదాడులు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు.

నిర్భయ తండ్రి కూడా
ఇందిరా జై సింగ్ కామెంట్లపై ఇటు నిర్భయ తండ్రి బద్రినాథ్ సింగ్ కూడా రియాక్టయ్యారు. దోషుల ఉరిశిక్షపై ఇందిరా సలహా తమకు అవసరం లేదని చెప్పారు. ఇందిరా జై సింగ్ వల్లే దేశంలో లైంగికదాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు. అంతేకాదు ఆమెకు మహిళల బాధ అంటే ఏంటో తెలియదని కూడా కామెంట్ చేశారు.
ఇందిరా ట్వీట్లు..
ఆశాదేవి వ్యాఖ్యలపై ప్రముఖ న్యాయవాది ఇందిరా జై సింగ్ స్పందించారు. దోషులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించగా.. ఆశాదేవి ఎందుకు వారిని క్షమించడం లేదన్నారు. ‘నిర్భయ తల్లి ఆశాదేవి పడే మనోవేదన తెలుసు, కానీ ఆమె ఎందుకు సోనియాగాంధీని ఆదర్శంగా తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ హతమార్చిన నళినికి సోనియా క్షమాభిక్ష ప్రసాదించారు కదా అని గుర్తుచేశారు. నళినికి ఉరిశిక్ష విధించాలని అనుకోవడం లేదు అని సోనియా చాలా సందర్భాల్లో చెప్పారు. నిర్భయ ఘటనపై మేమంతా మీతో ఉన్నాం, కానీ ఉరిశిక్షకు మాత్రం తాను వ్యతిరేకమన్నారు. సోనియా గాంధీ లాగా ఎందుకు ఆశాదేవి పెద్ద మనసు చేసుకోవడం లేదు అని' ఇందిరా జై సింగ్ ట్వీట్ చేశారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్భయ తల్లిదండ్రులు ఘాటుగా స్పందించారు.












Click it and Unblock the Notifications