Income Tax: వేతన జీవులకు కేంద్రం ఊరట - పన్ను స్లాబ్ ల్లో మార్పు - స్టాండర్డ్ డిడక్షన్ పెంపు..!
దేశవ్యాప్తంగా కేంద్ర బడ్జెట్ పై గంపెడాశలు పెట్టుకున్న వేతన జీవులకు కేంద్రం కాస్త ఊరటనిచ్చింది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను స్లాబ్ ల్లో పలు మార్పులు చేశారు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి కూడా పెంచారు. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను పరిమితి కూడా పెంచారు. దీంతో ఉద్యోగులకు ఊరట దక్కినట్లయింది.
ఇవాళ బడ్జెట్ లో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ప్రకారం.. కొత్త పన్ను విధానంలో స్లాబ్ ల్లో మార్పులు జరిగాయి. దీని ప్రకారం 3 లక్షల వరకూ ఎలాంటి పన్నూ విధించరు. 3 లక్షల నుంచి 7 లక్షల వరకూ పన్నుపై 5 శాతం పన్ను విధించారు. 7 నుంచి 10 లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను విధిస్తారు. 10 నుంచి 12 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను విధించారు. అలాగే 12 లక్షల నుంచి 15 లక్షల ఆదాయం ఉంటే 15 శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. 15 శాతం కంటే ఎక్కువగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధిస్తారు.

తాజా మార్పుల తర్వాత వేతన జీవులకు రూ.17500 పన్ను ఆదా అవుతుందని ఆర్థికమంత్రి నిర్మల తెలిపారు. పాత పన్ను విధానం కొనసాగుతున్నా అందులో ఎలాంటి మార్పులూ లేవు. క్రమంగా పాత పన్ను విధానం నుంచి కొత్త పన్ను విధానం దిశగా ఉద్యోగులను నడిపించాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో తాజా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటన్ గెయిన్స్ పై పన్ను పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచారు.












Click it and Unblock the Notifications