సినిమాలు, టీవీ సీరియల్స్, రియాల్టీ షోల్లో చాన్స్, మత్తు ఎక్కించిన నిషా మేడమ్ కహాని !
బెంగళూరు: మోసాలు చెయ్యడానికి ఎవరు ఎప్పుడు ఎవరిని మోసం చేస్తారో చెప్పడం చాలా కష్టం. సినీ నటుల పేర్లను అడ్డం పెట్టుకుని వారు మాకు పరిచయం ఉన్నారని చెప్పి టీవీ, రియాల్టీ షోలలో అవకాశం ఇప్పిస్తానని నమ్మించి నిషా అనే నిందితురాలు అమాయకులైన చిన్నారుల తల్లిదండ్రులను మోసం చేసి సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల రూపాయల వరకు మోసం చేసినట్లు విచారణలో తేలిందని సెంట్రల్ డివిజన్ డీసీపీ శ్రీనివాసగౌడ్ తెలిపారు.
బెంగళూరు నగరంలో శ్రీనివాసగౌడ్ విలేకరులతో మాట్లాడుతూ సినీ నటుడు మాస్టర్ ఆనంద్ కుమార్తె వంశిక పేరుతో నిషా అనేక మందిని మోసం చేసి వారిని నిలువునా ముంచేసిందని, ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని అన్నారు. విచారణ పూర్తయిన తర్వాత ఎంతమంది డబ్బులు పోగొట్టుకున్నారో స్పష్టంగా తెలుస్తుందని డీసీపీ శ్రీనివాస గౌడ మీడియాకు చెప్పారు.

తన కూతురు, బాలనటి వంశిక పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ అధినేత నిషా నరసప్పపై మాస్టర్ ఆనంద్ భార్య యశస్విని బెంగళూరు నగరంలోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితురాలు నిషాను సదాశివనగర పోలీసులు అరెస్ట్ చేశారు.
నిషాను అరెస్టు చేసిన తరువాత ఆమె చేతిలో మోసపోయిన వారి వివరాలు ఒక్కొక్కట బయటకు వస్తున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది శ్రీమంతులు, మధ్యతరగతి వాళ్లు తమ పిల్లలు టీవీల్లో, రియాలీటీ షోల్లో కనపడాలని, అందుకు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి సిద్దం కావడంతో నిషా లాంటి కిలాడీ లేడీలు ఇలా మోసాలు చేస్తున్నారని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications