అంబానీల ఇంట నవ తరం ఆరంభం: రూ.వేల కోట్లకు వారసుడొచ్చాడు: కొత్త పాత్రలో ముఖేష్-నీతా
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట వారసుడు జన్మించాడు. ముఖేష్ అంబానీ-నీతా అంబానీ ఇక గ్రాండ్ పేరెంట్స్ అయ్యారు. ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య శ్లోకా మెహతా పండంటి బాబుకు జన్మనిచ్చారు. ముంబైలోని ఓ టాప్ కార్పొరేట్ ఆసుపత్రిలో కొద్దిసేపటి కిందటే శ్లోకా మెహతా.. కుమారుడికి జన్మనిచ్చినట్లు ముఖేష్ అంబానీ కుటుంబం వెల్లడించింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. దీనితో అంబానీల కుటుంబంలో మలి తరం ఆరంభమైనట్టయింది.
గత ఏడాది ఆకాష్ అంబానీ-శ్లోకా మెహత వివాహం జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా, మోనా మోహతాల కుమార్తె శ్లోకా. శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో శ్లోకా- ఆకాశ్ అంబానీ తల్లిదండ్రులయ్యారని ముఖేష్ కుటుంబం పేర్కొంది. వారికి కుమారుడు జన్మించినట్లు తెలిపింది. నీతా- ముఖేష్ అంబానీ మొదటిసారిగా గ్రాండ్ పేరెంట్స్ అయ్యారని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ధీరూభాయ్ వంశంలో కొత్త తరం ఆరంభమైందని, నూతన శకానికి ఇది దారి తీస్తుందని కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన టెలికమ్యూనికేషన్ల విభాగాన్ని ఆకాష్ అంబానీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్లలో ఆకాష్ ఒకరు. ఆకాష్ చెల్లెలు ఇషా అంబానీ కూడా రిలయన్స్ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఉన్నారు. పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ఫార్చ్యూన్ 40 జాబితాలో చోటు దక్కించుకున్నారు. అంబానీల లెగాసీని కొనసాగిస్తున్నారు. ఆయన భార్య శ్లోకా కూడా వ్యాపారరంగంలో ఉన్నారు. తన తండ్రికి చెందిన కంపెనీలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. కనెక్ట్ ఫర్ అనే సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications