అతను పిలిచినా నేను ప్రచారానికి వెళ్ళను, కాని, సెక్యులర్ శక్తులే గెలవాలి..ఎందుకిలా?
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ ఆహ్వనించినా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గోనబోనని బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు.
బీహర్ :ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేయబోనని బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కూటమి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు .ఈ ఎన్నికల్లో కాంగ్రెస్,సమాజ్ వాదీ పార్టీలు కూటమిగా పోటీచేస్తున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్ పి, బిజెపి, ఆర్ ఎల్ డి లు ఒంటరిగా పోటీచేస్తున్నాయి. అయితే ఆర్ ఎల్ డి తొలుత కాంగ్రెస్, సమాజ్ వాదీ కూటమిలో చేరాలని ప్రయత్నించినా చివరినిమిషంలో సాధ్యం కాలేదు.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా నిలిచిన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల కూటమి విజయం సాధించాలనే ఆకాంక్షను జెడియూ వ్యక్తం చేసింది.

అఖిలేష్ పిలిచినా ప్రచారం చేయను
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కోరినా కాని, తాను ఆ ఎన్నికల్లో ప్రచారం చేయబోనని బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు.ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమిపాలు కావాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. సమాజ్ వాదీ పార్టీ కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని తాను మనస్పూర్తిగా కోరుకొంటున్నానని చెప్పారు నితీష్ కుమార్.

బీహర్ తరహలో కూటమి ఏర్పాటు చేయకపోవడంపై అసంతృప్తి
బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని నిలువరించేందుకుగాను ఆర్ జెడి కాంగ్రెస్ లతో కలిసి తాము ఏర్పాటు చేసిన మహకూటమి మంచి ఫలితాలు సాధించిందని జెడియూ నాయకులు గుర్తుచేస్తున్నారు. బీహర్ తరహలోనే మహకూటమిని ఉత్తర్ ప్రదేశ్ లో ఏర్పాటు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు వచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల కూటమితో పాటు ఇంకా కొన్ని పార్టీలు కలిస్తే ప్రయోజనం దక్కేదని ఆయన చెప్పారు.

ఉత్తర్ ప్రదేశ్ లో సెక్యులర్ శక్తులు గెలవాల్సిందే
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ , కాంగ్రెస్ పార్టీ కూటమి గెలిచి తీరాల్సిన పరిస్థితుల తప్పనిసరిగా ఉన్నాయని నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో సెక్యులర్ శక్తులు విజయం సాధించాలంటే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ కాంగ్రెస్ పార్టీల కూటమి విజయం సాధించాలన్నారు నితీష్ కుమార్.

యూపిలో పోటీకి దూరంగా జెడియూ
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సెక్యులర్ శక్తుల ఓట్లు చీలకుండా ఉండేందుకుగాను జెడియూ దూరంగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆర్ ఎల్ డి తో కలిసి జెడియూ పోటీచేస్తోందని తొలుత ప్రచారం సాగింది.అయితే సెక్యులర్ ఓట్లు చీలకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది జెడియూ
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications