నితీశ్ కు ఊహించని దెబ్బ, ఇక ఆ పదవితో కంట్రోల్ - బీజేపీ మార్క్ రాజకీయం..!!
బీజేపీ మార్క్ రాజకీయం మరోసారి తెర మీదకు వచ్చింది. బీహార్ కేంద్రంగా చేసిన ఆపరేషన్ పూర్తి అయింది. కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కూటమిగా గెలిచి నితీశ్ ను సీఎం చేసిన బీజేపీ.. ఇప్పుడు అదే నితీశ్ ను రాజ్యసభకు పంపుతోంది. దీంతో.. బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ శకం ముగిసింది . సీఎం పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బీహార్ నుంచి రాజ్యసభకు నితీష్ నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు నితీశ్ ప్రకటించారు. అయితే.. ఇప్పుడు
బీహార్ లో పది సార్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన నితీశ్ రాజకీయ శకం ఇక సొంత రాష్ట్రం లో ముగిసినట్లే కనిపిస్తోంది. అనూహ్య రాజకీయం వేళ నితీశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 200 సీట్లకు పైగా స్థానాలను గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షమైన జేడీయూ 85 స్థానాలతో రెండో స్థానంలోనూ, లోక్‌జన్‌శక్తి పార్టీ (రామ్‌విలాస్) 19 స్థానాలతో మూడో స్థానంలోనూ నిలిచాయి.

నితీశ్ తమ కూటమి ముఖ్యమంత్రి గా బీజేపీ నేతలు ప్రకటించారు. ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఇప్పుడు ఊహించని రాజకీయం చోటు చేసుకుంది. నితీశ్ ను రాజ్యసభకు పంపి.. బీహార్ లో నితీశ్ తనయుడు ఉప ముఖ్యమంత్రిగా ఒప్పందం జరిగింది. నితీశ్ తనయుడు నిషాంత్ కుమార్ బిహార్ డీప్యూటీ సీఎం గా చేస్తూనే... బీజేపీ తమ పార్టీ నేతను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టనుంది.
బీజేపీ దెబ్బకు నితీశ్ విలవిల
కాగా.. ఇప్పుడు నితీశ్ ను రాజ్యసభకు పంపినా.. కీలక పదవి ఇవ్వాలనే ఆలోచనతో బీజేపీ నాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అందులో భాగంగా నితీశ్ కు రైల్వే శాఖ అప్పగిస్తారని సమాచారం. రైల్వే మంత్రిగా నితీశ్ సుదీర్ఘ కాలం పని చేసారు. రైల్వే లో అనేక కీలక నిర్ణయాలు ఆయన హయాంలోనే జరిగాయి. త్వరలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ.. కేబినెట్ లోని కొందరు సీనియర్లను పార్టీ వ్యవహారాలకు పరిమితం చేయనున్నారు.
అదే విధంగా తమిళనాడు, బెంగాల్ నుంచి కొత్తగా కేంద్ర కేబినెట్ లో పార్టీ నేతలకు అవకాశం దక్కనుంది. ఏపీ నుంచి టీడీపీ లేదా జనసేన నుంచి మరొకరికి ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. బీహార్ కేంద్రంగా బీజేపీ మార్క్ పొలిటికల్ గేమ్ తో ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. బీహార్ లో ఇప్పుడు బీజేపీ పాలన ప్రారంభించేందుకు రంగం సిద్దమైంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications