సీఎం పదవికి నితీష్ రాజీనామా- మంత్రి మండలి రద్దు: ఫేర్ వెల్ స్పీచ్ లో హైడ్రామా
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవికి గుడ్ బై చెప్పారు. కొద్దిసేపటి కిందటే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అత హస్నైన్ కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతిప్పాయి. బీహార్ రాజకీయాల నుండి ఆయన పూర్తిగా వైదొలగినట్టయింది. మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఆదేశాలు, తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తాజా పరిణామం చోటు చేసుకుంది.
ఇది- రాష్ట్రీయ జనతాదళ్ (యునైటెడ్)లో చర్చనీయాంశమైంది. ఆయన ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం రాజ్యసభ సభ్యత్వాన్ని స్వీకరించిన తర్వాత ఎమ్మెల్సీ పదవిని వదులుకోవడం తప్పనిసరి. దీంతో ఆయన రాజీనామా చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 10వ తేదీన ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

రాజీనామాకు ముందు నితీష్ కుమార్ తన చివరి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు. మంత్రి మండలిని రద్దు చేయాలనే తన నిర్ణయాన్ని సహచరులకు వివరించారు. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన సుమారు ఆరు నిమిషాల పాటు మంత్రిమండలిని ఉద్దేశించి మాట్లాడారు. 2005 నుండి తన నాయకత్వంలో అమలు చేసిన పథకాలు, సాధించిన పనులను ప్రస్తావించారు.
2005లో అధికారంలోకి వచ్చానని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తి మేరకు పని చేశానని నితీష్ కుమార్ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. తన రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలగినప్పటికీ.. మనసు ఎప్పుడూ ఇక్కడే ఉంటుందని పేర్కొన్నారు. పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త, ప్రతి సామాన్యుడికీ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి తన మార్గదర్శకత్వం ఉంటుందని నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా ప్రక్రియ మధ్యాహ్నం సాగింది. అంతకుముందు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి.. నితీష్ కుమార్‌ను ఆయన నివాసంలో కలిశారు. అక్కడి నుంచి లోక్ భవన్ కు బయలుదేరి వెళ్లారు. ఈ మధ్యాహ్నం 3:15 నిమిషాలకు నితీష్ కుమార్ రాజీనామా సమర్పిస్తారని రాజ్ భవన్ కు ముందుగానే తెలియజేశారు. దీనికి అనుగుణంగా గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు.
కాగా- ఇంకాస్సేపట్లో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. తదుపరి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ఎంపిక కావడం దాదాపు లాంఛనప్రాయమే. కేంద్ర పరిశీలకులుగా నితిన్ నబిన్, శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి హాజరు కానున్నారు. సామ్రాట్ చౌదరి ఎంపిక తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాలని ఈ సాయంత్రమే గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications