అనుకున్నది చేసిన నిత్యానంద స్వామి, ప్రియ శిష్యురాలు దేశ ప్రధానిని చేశాడా ?

బెంగళూరు/చెన్నై: మహిళ మీద అత్యాచారం చేశారని ఆరోపణలతో భారతదేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి అలియాస్ నిత్యానంద కైలాస అనే దేశం స్థాపించుకున్నారు. స్వయం ప్రకటిత దైవ మానవుడు అని ప్రకటించుకున్న నిత్యానంద మరోసారి వార్తల్లోకి వచ్చారు. కైలాస దేశ ప్రధానిగా నిత్యానంద ఆయన ప్రియ శిష్యురాలు, బహుబాష నటి రంజితను ప్రకటించారని వార్తలు గుప్పుమన్నాయి.

రేప్ కేసుతో పాటు పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద భారత్ నుంచి తప్పించుకుని ఈక్వెడార్ తీరంలో తన సొంత దేశం నిర్మించుకుని దానికి కైలాస దేశం అని పేరు ప్రకటించుకున్నారు. ప్రస్తుతం నిత్యానంద ఆయన కైలాస దేశంలో ఆయన శిష్యులతో కలిసి జీవిస్తున్నారు.

nithyanandaswamyactressranjitha

నిత్యానంద తన దేశానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని పేరు పెట్టారు. అక్కడ ప్రత్యేక కరెన్సీ, ప్రత్యేక పరిపాలన ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇప్పుడు కైలాస దేశం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తన ప్రియశిష్యురాలు, అలనాటి నటి రంజితను దేశ ప్రధానిగా నిత్యానంద ప్రకటించారని తమిళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని నిత్యానంద ఆశ్రమం వెబ్‌సైట్‌లో నిత్యానంద చెప్పినట్లు సమాచారం. కానీ ఖచ్చితమైన సమాచారం మాత్రం బయటకురాలేదు.

నిత్యానంద వెబ్‌సైట్‌లో రంజిత ఫోటో కింద నిత్యానందమయి అనే పేరు ఉంది. అందులో దిగువన హిందువుల కోసం స్వామి నిర్మించిన కైలాసాన్ని దేశానికి ప్రధానిగా నిత్యానందమయి అలియాస్ రంజితనను ప్రకటించారని రాసి ఉంది. ఇటీవల కైలాష్ దేశ ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొన్నారు. ఈనేపథ్యంలో నటి రంజిత కూడా ఐక్యరాజ్యసమితి సమావేశానికి కైలాస ప్రధాని హోదాలో హాజరైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

nithyanandaswamy

13 సంవత్సరాల క్రితం బెంగళూరు సమీపంలోని బిడిది సమీపంలోని ధ్యాన పీఠంలో నిత్యానందచ నటిరంజిత రసలీల చేస్తున్న వీడియో బయటకు రావడంతో అది వైరల్‌గా మారింది. ఈ విషయం పెద్ద వార్త అయింది. ఈ కేసు పరిష్కారం కాకముందే నిత్యానంద తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆర్తీరావు అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిత్యానందపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

తరువాత జైలు నుంచి బయటకు వచ్చిన నిత్యానంద రామనగర కోర్టులో జరుగుతున్న కేసుల విచారణకు హాజరు అవుతూ వచ్చారు. 2019లో దేశం విడిచి వెళ్లిన నిత్యానంద కైలాస దేశాన్ని నిర్మించి సకల సౌభాగ్యాలతో అక్కడ హ్యాపీగా జీవిస్తున్నాడన్నారు. లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో నిత్యానంద ఓ ప్రైవేట్ ద్వీపాన్ని కొనుగోలు చేసి దానిని తన కైలాస దేశంగా ప్రకటించుకున్నారు.

ఈ ద్వీపం ట్రినిడాడ్ మరియు టొబాగో నగరాలకు సమీపంలో ఉంది. అంటే నిత్యానంద దేశం అమెరికా అట్టడుగున ఉంది. ఈ దేశానికి కైలాస అని పేరు పెట్టారు. నిత్యానంద ఆయన దేశం కోసం ప్రత్యేక జెండా, చిహ్నం, ప్రత్యేక పాస్‌పోర్ట్‌ను కూడా సిద్ధం చేశారు. కైలాస దేశాన్ని పూర్తి హిందూ దేశంగా నిత్యానంద ఇప్పటికే ప్రకటించారు. కైలాస దేశంలో నిత్యానంద చెప్పిందే శాసనం.

nithyanandaswamy

రంజిత మరియు ఆమె సోదరితో సహా చాలా మంది భక్తులు కైలాస దేశంలోనే ఉన్నారు. తమిళ నటి రంజిత కొన్ని తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. ప్రముఖ నటుడు అశోక్ కుమార్ కుమార్తె ఈ సినీనటి రంజిత. 1992లో నాడోడి తెండ్రాల్‌ అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రంజిత తరువాత పలు బాషల్లోని సినిమాల్లో నటించింది. నిత్యానంద రంజిత నటించిన సినిమాలు చూసి ఆమెను దక్కించుకున్నారనే ప్రచారం కూడా జరిగింది.

రంజిత తండ్రి నటుడు అశోక్ కుమార్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికాలో ఉన్న తన చెల్లిని చూడ్డానికి రంజిత ఎక్కువగా ఆదేశానికి వెళ్లిందని, ఆ సమయంలో నా కూతురు నిర్మల అమెరికాలోని నిత్యానంద ఆశ్రమానికి వెళ్తోందని, ఆమెతో పాటు రంజిత కూడా వెళ్లడం మొదలుపెట్టిందని వివరించారు. నిత్యానంద ఆశ్రమానికి వెళ్లే సమయంలో రంజిత కూడా తన భర్తకు విడాకులు ఇచ్చింది. రంజిత సోదరి నిర్మల కూడా ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసి నిత్యానంద ఆశ్రమంలో సెటిల్ అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+