జైల్లో శశికళకు ఏసీ లేదు, పరుపు లేదు, టీవీ మాత్రమే
బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని జైలు అధికారులు చెప్పారు.
చెన్నై: బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని జైలు అధికారులు చెప్పారు.
ఏసీ లేదని, పరుపు లేదని, కేవలం టీవీ మాత్రమే ఇచ్చామని తెలిపారు. అలాగే, కర్నాటక జైలు నుంచి తమిళనాడులో జైలుకు కూడా తరలించే అవకాశాలు లేవని కర్నాటక జైళ్ల డిఐజీ తెలిపారు.

శశికళకు జైలులో అందుతున్న సౌకర్యాల పైన చెన్నైకి చెందిన ఓ లాయర్ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగారు. దానికి డీఐజీ (జైళ్లు) సమాచారం వచ్చింది. ఆమెకు టీవీ తప్ప మరే ప్రత్యేక సదుపాయాలు లేవని చెప్పారు.
గత నెల ఫిబ్రవరి 20వ తేదీన అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టిటివి దినకరన్ ఆమెతో 35 నుంచి 45 నిమిషాల వరకు భేటీ అయ్యారని చెప్పారు. పళని స్వామి ముఖ్యమంత్రి అయ్యాక దినకరన్ తొలిసారి ఆమెను జైలులో కలిసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications