జయపై వెంకయ్య నో కామెంట్, ఏపీ రైల్వే జోన్‌పై మంత్రి

హైదరాబాద్/చిత్తూరు: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం హైదరాబాదులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంశంపై మాట్లాడేందుకు నిరాకరించారు. తాను జయలలిత అంశం పైన మాట్లాడదల్చుకోలేదని చెప్పారు.

తనకు వారసత్వ రాజకీయాల పైన నమ్మకం లేదన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగం దూరదర్శన్ చానల్లో ప్రసారం చేయడంపై రాద్దాంతం అనవసరమన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనంతరం.. త్వరలో దేశ నాయకుల విగ్రహాలు శుభ్రం చేసే కార్యక్రమం చేపడతామన్నారు.

అంతకుముందు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వెంకయ్య అన్న విషయం తెలిసిందే. హైదరాబాదులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ భారత్ యాంత్రికంగా తంతులా ముగించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదన్నారు.

No comment: Venkaiah Naidu on Jayalalithaa

ప్రభుత్వంతో పాటు ప్రజలు ఇందులో పాల్గొనాలన్నారు. స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లు దాటినా గ్రామాల్లో మురుగు దొడ్ల సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటన్నారు. పరిశుభ్రతను పట్టించుకోకపోతే సామాజిక జబ్బుగా పరిణమించే ప్రమాదముందని హెచ్చరించారు. చెత్త, అపరిశుభ్రం వల్ల రోగాలు వస్తాయన్నారు.

ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ సోమవారం తిరుపతి రైల్వే స్టేషన్‌లో పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కమిటీ నివేదిక తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రైల్వేలో భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎఫ్‌డీఐలతో రైల్వేను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఆదివారం సదానంద గౌడ మాట్లాడుతూ.. త్వరలోనే భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి చేరుకుంటుందని అన్నారు.

ఆదివారం శ్రీకాళహస్తికి వచ్చిన ఆయన ఆలయంలో ప్రత్యేక రాహు-కేతు పూజ చేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మోడీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఉందన్నారు. 2015లో జరిగే గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని, శ్రీకాళహస్తీశ్వరుడ్ని ప్రార్థించానని సదానంద తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+