ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం.. అవిశ్వాస తీర్మానం.. గురువారం చర్చ, ఓటింగ్ ఎప్పుడంటే..?
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం పొంచి ఉంది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పీఎంఎల్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు షాబాజ్ ఫరీఫ్ తీర్మానం పెట్టగా.. చర్చకు స్వీకరిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరి తెలిపారు. ఈ నెల 31వ తేదీ సాయంత్రం 4 గంటలకు దీనిపై చర్చ జరుగుతుందని చెప్పారు. తీర్మానంపై ఏప్రిల్ ఒకటి నుంచి 4వ తేదీ మధ్య ఓటింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
Recommended Video

పాకిస్థాన్ దిగువ సభ్యలో 342 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్షాలు అవిశ్వాసంలో నెగ్గాలంటే వారికి 172 సభ్యుల ఓట్లు అవసరం. ప్రస్తుతం ఇమ్రాన్ కూటమిలో 178 మంది, ప్రతిపక్షాల కూటమిలో 163 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పీటీఐకి చెందిన 24 మంది సభ్యులు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బహిరంగంగా ప్రకటించారు. పీటీఐ సభ్యులు ప్రస్తుతం సింధ్ హౌస్‌లో ఉన్నారు. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఇమ్రాన్ ఖాన్ పదవీ ఊడటం ఖాయం. ఈ 24 మంది ఎంపీలు చివరి రోజు అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసే వరకూ సురక్షిత ప్రాంతంలో ఉండాలని నిర్ణయించుకున్నారు.

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాలంటే 68 మంది ఎంపీల సంతకాలు అవసరం. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 100 మంది సభ్యులు ఇప్పటికే సంతకం చేశారు. ఇమ్రాన్ పార్టీ ఎంపీలు రెబల్స్‌గా మారడంతో ఇప్పుడు ఆయన పదవీకి గండం ఏర్పడింది. గతంలో రెండు సార్లు పాకిస్థాన్ ప్రధానులపై అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. అవి వీగిపోయాయి. తొలుత 1989లో బెనర్జీ భుట్టోపై అవిశ్వాస తీర్మానం పెట్టగా ఆమె 12 ఓట్ల తేడాతో నెగ్గారు. 2006లో ప్రధాని షౌకాత్ అజీజ్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఓడించారు. మరీ ఈ సారి ఇమ్రాన్ ఖాన్ నెగ్గుతారా...లేదా ఓడతారో చూడాలీ. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఆయన ఓడటమే ఖాయం అనిపిస్తోంది. ఇటీవల చేసిన కామెంట్స్.. సొంత పార్టీ ఎంపీలకు కోపం తెప్పించాయి. అదే ముఖ్య కారణంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications