పేరు మార్చుకుంటే అధికారంలోకి రారు.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ నరేంద్ర మోడీ, వీగిన అవిశ్వాసం

కేంద్ర ప్రభుత్వం పై ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రకటించాయి. ఇందులో భాగంగా అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో చర్చ జరుగుతోంది. మణిపూర్ అంశంపై ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టాలంటే అవిశ్వాస తీర్మానమే సరైనదనే ఏకాభిప్రాయానికి రావడంతో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రతిపక్షాలు ఇచ్చాయి. అందులో భాగంగా ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్..బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు కొద్ది రోజుల క్రితమే అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. 50 మంది ఎంపీలు సంతకాలు చేసారు. ఇప్పటికే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు లోక్‌సభలో పాస్ అయ్యింది.

ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పైన అవిశ్వాసం పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించారు. 26 పార్టీల ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ లోక్ సభా పక్ష ఉప నేత గౌరవ్ గొగోయ్ అవిశ్వాసం పైన నోటీసు ఇచ్చారు. ఇండియాలో భాగస్వామి కాకపోయినా..విడిగా బీఆర్ఎస్ సైతం అవిశ్వాస నోటీసు ఇచ్చింది. ఇక ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ సభలో ప్రసంగిస్తారు. ప్రధానంగా మణిపూర్ అంశంపై ఆయన సభలో ప్రస్తావిస్తారు. ఇక మోదీ సర్కార్‌ పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

No confidence

Aug 10, 2023, 9:02 pm IST

కాంగ్రెస్ పక్ష సభ్యుడు అధిర్ రంజన్ చౌదరిని లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు.
Aug 10, 2023, 7:30 pm IST

గంటన్నరకుపైగా విపక్షాలు సభలో తిట్లను ఓపికతో విన్నాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు.
Aug 10, 2023, 7:28 pm IST

ఆ తర్వాత సభ వాయిదా పడింది.
Aug 10, 2023, 7:26 pm IST

మూజువాణి ఓటుతోనే వీగిన అవిశ్వాసం. ఓటింగ్ కు ముందే వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు.
Aug 10, 2023, 7:24 pm IST

విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
Aug 10, 2023, 7:24 pm IST

తమ ప్రభుత్వం అనుక్షణం దేశ ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది: మోడీ
Aug 10, 2023, 7:23 pm IST

మణిపూర్ ప్రజలకు మనమంతా అండగా ఉండాలి: మోడీ
Aug 10, 2023, 7:22 pm IST

రాజకీయాలు బయట చేసుకోవాలి.. సభలో కాదు: మోడీ
Aug 10, 2023, 7:21 pm IST

ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధిపై సభలో చర్చ జరగాలి: మోడీ
Aug 10, 2023, 7:20 pm IST

మా ప్రతి క్షణం దేశ హితం కోసమే: ప్రధాని మోడీ
Aug 10, 2023, 7:18 pm IST

కాంగ్రెస్ వాళ్లు మణిపూర్, మిజోరాం, నాగాలండ్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకపోతున్నారా?: మోడీ
Aug 10, 2023, 7:17 pm IST

మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు.. మీరు కళ్లు తెరిచి చూస్తే అభివృద్ధి కనబడుతుంది: మోడీ
Aug 10, 2023, 7:16 pm IST

ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు కొత్తగా వస్తున్నాయి.. కనబడటం లేదా?: మోడీ
Aug 10, 2023, 7:13 pm IST

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మా ప్రాధాన్యత: మోడీ
Aug 10, 2023, 7:11 pm IST

ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లు, అశాంతికి గత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణం: మోడీ
Aug 10, 2023, 7:10 pm IST

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి 2014 నుంచే ప్రారంభమైంది: ప్రధాని మోడీ
Aug 10, 2023, 7:10 pm IST

ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు: ప్రధాని మోడీ
Aug 10, 2023, 7:02 pm IST

భారతమాత పట్ల విపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా: ప్రధాని మోడీ
Aug 10, 2023, 6:57 pm IST

ఓట్లు, రాజకీయాల కోసం ప్రజల మధ్య విధ్వేషాలు పెంచడం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది: మోడీ
Aug 10, 2023, 6:57 pm IST

ఒకసారి భారతమాత హత్య అంటారు.. మరోసారి రాజ్యాంగం హత్య అంటారు ఎలాంటి భాష ఇది..: మోడీ
Aug 10, 2023, 6:56 pm IST

భారతమాత హత్య అంటే దేశ వినాశనాన్ని కోరుకోవడమేనంటూ రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ మండిపడ్డారు.
Aug 10, 2023, 6:52 pm IST

మణిపూర్‌లో ప్రజలు ఐక్యంగా మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని భావిస్తున్నా: మోడీ
Aug 10, 2023, 6:50 pm IST

మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న విశ్వాసం ఉంది: మోడీ
Aug 10, 2023, 6:49 pm IST

మణిపూర్ ప్రజలకు అండగా భారతదేశం మొత్తం ఉంది, పార్లమెంట్ ఉంది: ప్రధాని మోడీ
Aug 10, 2023, 6:49 pm IST

మణిపూర్‌లో మహిళలకు ఘోర అవమానం జరిగింది.. అది మనందరికి తలవంపులే: మోడీ
Aug 10, 2023, 6:48 pm IST

మణిపూర్ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత గురించి అమిత్ షా సభకు తెలిపారు: మోడీ
Aug 10, 2023, 6:47 pm IST

మణిపూర్‌లో ఏం జరిగిందో నిన్న అమిత్ షా పూర్తిగా వివరించారు: మోడీ
Aug 10, 2023, 6:47 pm IST

మణిపూర్‌లో ఏం జరిగిందన్న దానిపై పూర్తి చర్చ జరగాలని విపక్షాలు కోరుకోవడం లేదన్నారు మోడీ.
Aug 10, 2023, 6:45 pm IST

ప్రధాని మాట్లాడుతుండగానే సభలోంచి వెళ్లిపోయిన విపక్షాల సభ్యులు.
Aug 10, 2023, 6:45 pm IST

రాజకుమారుడి ఇప్పుడిప్పుడే కారు అద్దాలు దించి ప్రజల కష్టాలు చూస్తున్నారని రాహుల్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ అన్నారు.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+