నో కరోనా.. నిబంధనలు బేఖాతరు.. పాదయాత్రకు డీకే శ్రీకారం
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వారాంతపు కరోనా నిబంధనలను బేఖాతరు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ 10 రోజుల పాదయాత్రకు ఆదివారం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రామ్‌నగర్ జిల్లా నుంచి ప్రారంభమైన పాదయాత్ర 100 కిలోమీటర్ల వరకూ సాగి బెంగళూరు చేరుకోవడంతో ముగియనుంది. తాగునీటి ప్రాజెక్టు డిమాండ్‌పై డీకే శివకుమార్ సారథ్యంలో మొదలైన పాదయాత్రలో వందలాది మంది పాల్గొన్నారు. వీరిలో కొద్ది మంది మాత్రమే మాస్కులు ధరించగా, చాలామంది మాస్క్‌లు ధరించకపోవడం, సామాజిక దూరం నిబంధనల పాటించలేదు.
పాదయాత్రలో వంద మందికి పైగా ఎమ్మెల్యేలు, 200 మంది మాజీ ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు, నటులు, మతపెద్దలు పాల్గొంటామని హామీ ఇచ్చారని, ప్రజా ఆందోళనలను, వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షల బూచి చూపుతోందని డీకే పేర్కొన్నారు. జలాల కోసం పాదయాత్ర చేస్తున్నాం. ఆంక్షల పేరుతో మమ్మల్ని ప్రభుత్వం ఆపాలని అనుకుంటోంది. ఇక్కడేమీ ఎలాంటి కరోనా లేదు. బీజేపీ ప్రభుత్వం కేవలం భయాలు సృష్టిస్తోంది. సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమంలో 5 వేల మందికి పైగా పాల్గొన్నప్పుడు కరోనా వ్యాప్తి జరగలేదు. ఇప్పుడెందుకు జరుగుతుందని ప్రశ్నించారు. ''మన జలాలు, మన హక్కు'' పేరుతో కాంగ్రెస్ ప్రారంభించిన ఈ పాదయాత్రలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు.

కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశంలోని 27 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో 3,623 కేసులు నమోదయ్యాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.
ఇటు కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అందుకు తగిన జాగ్రత్తలను తీసుకుంటుంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టంచేసింది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఒమిక్రాన్ వైరస్ వాయువేగంతో వ్యాపిస్తోంది. ఒకరికి సోకితే.. ఆ ఫ్యామిలీకి దాదాపుగా వస్తోంది. సన్నిహితంగా మెలిగితే చాలు వైరస్ వస్తోంది.












Click it and Unblock the Notifications