కోవిడ్ డేటా లీక్ కాలేదు: ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటు చేసిన కోవిన్ పోర్టల్(Cowin portal)లోని సున్నితమైన సమాచారం లీకైందంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆరోగ్యశాఖకు చెందిన కోవిన్ పోర్టల్ పూర్తిగా సురక్షితమైనదని స్పష్టం చేసింది. ఆ పోర్టల్‌లోని సమాచారం గోప్యంగా ఉందని తెలిపింది. డేటా లీక్ అయ్యిందనే వార్తలను కొట్టిపారేసింది.
ఎలాంటి ఆధారం లేకుండా డేటా లీకైందంటూ ప్రచారం జరిగిందని వెల్లడించింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని సీఈఆర్టీని కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా ఈ వ్యవహారంపై స్పందించారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేంద్రం తీసుకొచ్చిన కోవిన్ పోర్టల్‌లో ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ వివరాలు నమోదు చేయడం ద్వారా వ్యక్తులు టీకా తీసుకున్నారు. ఒకే ఫోన్ నెంబర్‌తో కుటుంబంలోని పలువురు టీకాలు వేయించుకున్నారు. ఇందులో వ్యక్తుల పేర్లు, ఆధార్ వివరాలు, ఫోన్ నెంబర్ తోపాటు ఏయే తేదీల్లో ఎక్కడ వ్యాక్సిన్ తీసుకున్నారు? వంటి సమచారం ఉంటుంది. అయితే, ఈ సమాచారం లీక్ అయ్యిందంటూ తాజాగా వార్తలు వచ్చాయి.
టెలిగ్రామ్‌లోని ఓ బాట్(bot) వ్యక్తుల ఫోన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే వారి పూర్తి సమాచారం వెలుగుచూస్తోందని ప్రచారం జరిగింది. వ్యక్తుల డేటా ఇలా బయటకు వచ్చిందన్న సమాచారం అనంతరం చాట్‌బాట్ నిలిచిపోయిందని తెలిసింది. లీకైన డేటాలో పలువురు ప్రభుత్వ అధికారులతోపాటు రాజకీయ నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత వివరాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో కోవిన్ డేటా లీక్ అయ్యిందంటూ ప్రచారం జరిగింది.
With ref to some Alleged Cowin data breaches reported on social media, @IndianCERT has immdtly responded n reviewed this
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) June 12, 2023
✅A Telegram Bot was throwing up Cowin app details upon entry of phone numbers
✅The data being accessed by bot from a threat actor database, which seems to…
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కోవిన్ పోర్టల్‌లో ఎలాంటి డేటా లీక్ కాలేదని స్పష్టం చేసింది. లీక్ వార్తలను తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ నిరాధార వార్తలు. కోవిన్ పోర్టల్ పూర్తిగా భద్రమైనది. ఇందులోని డేటాను గోప్యంగా ఉంచేందుకు వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్, యాంటీ-డీడీఓఎస్, ఎస్ఎస్ఎల్/టీఎల్ఎస్, రెగ్యూలర్ వల్నరబిలిటీ అసెస్మెంట్, ఐటెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్ మెంట్ ఇలా అన్ని భద్రతా ప్రమాణాలతో దీన్ని రూపొందించాం. ఓటీపీ అథెంటిటీతో మాత్రమే ఇందులో డేటాను చూడగలం అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఓటీపీ లేకుండా కోవిన్ పోర్టల్ లోని సమాచారాన్ని ఏ బాట్‌లోనూ షేర్ చేయలేమని కేంద్రం వెల్లడించింది. డేటా లీక్ వార్తలను దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యవహారాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని SERTని కేంద్రం ఆదేశించింది.












Click it and Unblock the Notifications