Breakthrough infections: ఆ కేసుల్లో ఒక్క 'మరణం' లేదు-ఎయిమ్స్ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఈ ఏడాది ఏప్రిల్-మే కాలంలో రీ-ఇన్ఫెక్షన్ బారినపడినవారెవరూ మరణించలేదని ఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) వెల్లడించింది. రీఇన్ఫెక్షన్ కేసులకు సంబంధించి జీనోమిక్ సీక్వెన్స్‌పై అధ్యయనం ద్వారా ఎయిమ్స్ ఈ విషయాన్ని నిర్దారించింది. పూర్తి వ్యాక్సిన్ తీసుకున్నాక రీఇన్ఫెక్షన్‌కి గురైన వారిలో అతికొద్ది మంది మాత్రమే అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరడం లేదా మరణించడం జరుగుతోందని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించడం గమనార్హం.

Breakthrough infections కేసులపై అధ్యయనం
పూర్తి వ్యాక్సిన్ తీసుకున్నాక మళ్లీ కోవిడ్ బారినపడుతున్న కేసులను breakthrough infectionsగా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది భారత్‌లో సెకండ్ వేవ్ పీక్స్‌కి చేరిన ఏప్రిల్-మే నెలలో breakthrough infections కేసులపై ఎయిమ్స్ అధ్యయనం చేసింది. వైరస్ వ్యాప్తి అంత పీక్స్‌లో ఉన్న దశలోనూ... వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రీఇన్ఫెక్షన్ బారినపడినవారెవరూ మృతి చెందలేదని పేర్కొంది. మొత్తం 63 breakthrough infections కేసులపై అధ్యయనం చేసినట్లు తెలిపింది. ఇందులో 36 మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోగా.. 27 మంది కేవలం ఒక డోసు వ్యాక్సిన్ మాత్రమే తీసుకున్నారు. 53 మంది కోవాగ్జిన్ తీసుకోగా... 10 మంది కోవీషీల్డ్ మాత్రమే తీసుకున్నారు.

23 శాంపిళ్లలో ఆ వేరియంట్
భారత్‌లో గుర్తించిన B.1.617 కోవిడ్ వేరియంట్‌ను మూడు రకాలుగా విభజించారు. ఇందులో B.1.617.1, B.1.617.2,B.1.617.3 వేరియంట్స్ ఉన్నాయి. తాజాగా అధ్యయనం చేసిన 63 breakthrough infections కేసుల్లో 23 శాంపిళ్లలో(63.9శాతం) B.1.617.2 వేరియంట్‌ను ప్రధానంగా గుర్తించారు. ఇందులో 12 మంది ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోగా.. 11 మంది ఒక డోసు మాత్రమే తీసుకున్నారు. మరో నలుగురిలో B.1.617.1,B.1.1.7 వేరియంట్స్‌ను గుర్తించారు. మొత్తంగా 63 breakthrough infections కేసుల్లో దాదాపుగా అందరూ ఐదు నుంచి ఏడు రోజుల పాటు తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. ఈ కేసుల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదు.
Recommended Video

10 మందిలో పూర్తి యాంటీబాడీలు
ఈ 63 breakthrough infections కేసుల్లో బాధితుల సగటు వయసు 37గా ఉంది. బాధితుల్లో 21 ఏళ్ల నుంచి మొదలు 92 ఏళ్ల వయసు వరకు ఉన్నారు. ఇందులో 41 మంది పురుషులు కాగా 22 మంది స్త్రీలు. వీళ్లెవరికీ దీర్ఘకాలిక వ్యాధులేమీ లేవు. ఇందులో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 8 మంది,ఒక డోసు మాత్రమే తీసుకున్న ఇద్దరిలో రోగ నిరోధకను పెంచే యాంటీబాడీలు పూర్తి స్థాయిలో ఉత్పత్తి అయినట్లు గుర్తించారు. ఇటీవలి పలు అధ్యయనాల ప్రకారం... కోవిడ్ టీకా తీసుకున్నవారిలో కనీసం ఏడాది కాలం ఈ వ్యాధిని ఎదుర్కొనే ఇమ్యూనిటీ ఉంటుందన్న విషయం వెల్లడైంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రానా రీఇన్ఫెక్షన్ బారినపడరన్న గ్యారెంటీ ఏమీ లేదు. కానీ కోవిడ్‌తో పోరాడేందుకు అవసరమయ్యే యాంటీ బాడీల ఉత్పత్తికి వ్యాక్సిన్ దోహదపడనుంది.












Click it and Unblock the Notifications