రూ.2వేల నోటుపై సమాధానమిచ్చిన మంత్రి నిర్మలా సీతారామన్

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం.. 2017 మార్చి నాటికి చలామణీలో ఉన్న రూ.500, రూ.2000 వేల నోట్ల విలువ రూ.9.512 లక్షల కోట్లు

ఒకప్పటితో పోలిస్తే ATM కేంద్రాల్లో రూ.2వేల నోట్లు గతంలోలా చెలామణిలో లేవు. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగానే ఆ నోట్లను తగ్గిస్తోందంటూ కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏటీఎం కేంద్రాల్లో రూ.2వేల నోటు లభ్యతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానమిచ్చారు. ATMలో నోట్లను ఉంచాలని గానీ, ఉంచొద్దని గానీ తాము బ్యాంకులకు సూచించలేదనిలిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం.. 2017 మార్చి నాటికి చలామణీలో ఉన్న రూ.500, రూ.2000 వేల నోట్ల విలువ రూ.9.512 లక్షల కోట్లు కాగా.. 2022 మార్చి నాటికి ఆ మొత్తం రూ.27.057 లక్షల కోట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు.

no direction on loading rs2000 notes in atms says central finance minister nirmala sitharaman

ఏటీఎం కేంద్రాల్లో నోట్లను అందుబాటులో ఉంచడమనేది బ్యాంకుల స్వతంత్ర నిర్ణయమని, కాలానికి అనుగుణంగా, ఖాతాదారుల అవసరాలను బట్టి నోట్లను జమ చేస్తుంటాయని స్పష్టత ఇచ్చారు. కేంద్రం అప్పులకు సంబంధించి మరో ప్రశ్నకు బదులిస్తూ.. 2023 మార్చి 31 నాటికి కేంద్రం అప్పులు రూ.155.8 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇది దేశ జీడీపీలో 57.3 శాతంగా ఉంటుందన్నారు.

no direction on loading rs2000 notes in atms says central finance minister nirmala sitharaman

దేశంలో చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం రద్దుచేసింది. రూ.500 నోటుతోపాటు కొత్తగా రూ.2వేల నోటు కూడా చెలామణిలోకి రావడంపై విమర్శలు వచ్చాయి. రూ.వెయ్యి నోటు రద్దుచేసిన తర్వాత రూ.2వేల నోటును ఎలా తీసుకొస్తారంటూ విపక్షాలు ప్రశ్నించాయి. తాజాగా మంత్రి ఇచ్చిన సమాధానాన్ని బట్టి రూ.2వేల నోటును ఆర్బీఐ రద్దుచేయలేదనేది స్పష్టమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+