Fastag యూజర్లకు కేంద్ర గుడ్ న్యూస్- కొత్త రూల్స్

జాతీయ రహదారులపై రాకపోకలు సాగించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టోల్ ట్యాక్స్ చెల్లింపు నిబంధనల్లో భారీ మార్పులు తీసుకుని వచ్చింది. అర్ధరాత్రి నుండి ఇవి అమలులోకి వచ్చాయి. ఈ కొత్త నియమాలు.. వాహనదారులకు ఎంతగానో అనుకూలంగా ఉంటోన్నాయి. వారిపై భారం పడకుండా కేంద్రం ఈ తాజా మార్పులు చేపట్టింది. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ను తగ్గించడమే కాకుండా డిజిటల్ చెల్లింపులను కూడా ప్రోత్సహించేలా వీటిని రూపొందించింది.

టోల్ గేట్ల వద్ద చెల్లింపులు, ఇతర కార్యకలాపాలు మరింత వేగంగా, పారదర్శకంగా ఉంటాయని జాతీయ రహదారుల సంస్థ వెల్లడించింది. ఈ తాజా నిబంధనలను అనుసరించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా టోల్ ప్లాజా వద్ద రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. అలాగే- టెక్నికల్ గా ఫాస్టాగ్ పని చేయకపోయినా ఎక్కువ మొత్తంలో టోల్ కట్టాల్సి వస్తుంది. ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 2008 హైవే ఫీజులకు అనుగుణంగా దీన్ని సవరించింది.

No Fastag No Problem Enjoy Reduced Toll Rates on National Highways
  • జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద ఏదైనా వాహనం.. ఫాస్టాగ్ లేన్‌లో ప్రవేశించినా, అది స్కాన్ కాకపోయినా లేదా వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా ఇకపై ఒకే విధమైన ఛార్జి వర్తించదు. దీనికి బదులుగా వేర్వేరుగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. చెల్లింపు విధానం ఆధారంగా విభిన్న జరిమానాలు కట్టాల్సి ఉంటుంది.
  • కొత్త నిబంధనల ప్రకారం- ఫాస్టాగ్ పని చేయకపోతే సంబందిత వాహన డ్రైవర్ నగదు రూపంలో ఆ మొత్తాన్ని చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. నిర్దేశిత టోల్‌కు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో ఆ వెహికల్ డ్రైవర్ యూపీఐ, లేదా ఏదైనా ఇతర డిజిటల్ మాధ్యమం ద్వారా ఆ మొత్తాన్ని కడితే అతని నుండి 1.25 రెట్లు మాత్రమే అధికంగా టోల్ వసూలు అవుతుంది.
  • ఉదాహరణకు- ఫాస్టాగ్ ద్వారా చెల్లించాల్సిన టోల్ మొత్తం 100 రూపాయలు అయితే అది పనిచేయనప్పుడు కట్టాల్సిన టోల్ మొత్తం 200 రూపాయలు ఉండేది. అంటే రెట్టింపు అన్నమాట. ఇప్పుడు ఇదే మొత్తాన్ని యూపీఐ/డిజిటల్ పేమెంట్ ద్వారా 125 చెల్లిస్తే సరిపోతుంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, వాహనదారులపై పడే భారాన్ని తగ్గించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
  • ఫాస్టాగ్ టెక్నికల్ లేదా గడువు ముగియడం, రీడర్ సమస్యల కారణంగా ఒక్కోసారి స్కాన్ అవ్వదు. గతంలో ఇలాంటప్పుడు వారికి రెట్టింపు టోల్ చెల్లించక తప్పనిసరి పరిస్థితి ఉండేది. కానీ కొత్త నిబంధనల తర్వాత, డిజిటల్ చెల్లింపును ఎంచుకోవడం ద్వారా ఈ భారం నుండి ఉపశమనం లభిస్తుంది.

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ద్వారా టోల్ ప్లాజాల వద్ద క్యూ తగ్గుతుందని జాతీయ రహదారుల సంస్థ చెబుతోంది. ఇది వాహనాల వేగాన్ని పెంచుతుంది. సమయాన్ని ఆదా చేస్తుంది. మొత్తం వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుంది. నగదు లావాదేవీలు తగ్గడం వల్ల మానవ తప్పిదాలు కూడా తగ్గుముఖం పడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+