ఫైజర్ వ్యాక్సిన్ కోసం భారత్ చర్చలు -అందరికీ టీకాలకు టైమ్ లైన్ లేదు -ఇప్పటికే రూ.10వేల కోట్ల ఖర్చు
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం తగ్గుముఖం పట్టినా, మూడో దశ వెల్లువెత్తొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. ఇప్పటికే దేశంలో నాలుగు టీకాలకు అనుమతివ్వగా, అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థతోనూ చర్చలు జరుగుతున్నాయని, 18 ఏళ్లు దాటిన అందరికీ టీకాలను అందించడానికి టైమ్ లైన్ పెట్టుకోలేదని కేంద్రం తెలిపింది. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాడవీయ శుక్రవారం పార్లమెంటులో కీలక ప్రకటనలు చేశారు..
Recommended Video
18 ఏళ్లు నిండిన అందరికీ టీకాలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికి ఫలానా గడువు(టైమ్ లైన్)ను నిర్ధారించుకోలేదని ఆరోగ్య మంత్రి మాండవీయ లోక్ సభకు సమాధానమిచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 135 కోట్ల టీకాల డోసులు అందుబాటులోకి వచ్చినట్లవుతుందని, అయితే, ఈ వ్యాక్సిన్ డ్రైవ్ ఎప్పుడు ముగుస్తుందనడానికి ఎటువంటి కచ్చితమైన సమయం లేదని.. డిసెంబర్ చివరినాటికి 18ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్ అందుతుందని మంత్రి తెలిపారు.

దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ల కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడంలో ఎటువంటి ఆలస్యం చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్‌తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూనే ఉందని.. లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.
కరోనా వైరస్, వ్యాక్సిన్ సంబంధిత అంశాలపై రాజకీయాలు చేయొద్దని మంత్రి మాండవీయ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. కొవిడ్-19 సమస్యలు, వ్యాక్సిన్ విధానంపై ప్రధాని మోదీ ఇప్పటికే సీఎంలతో 20సార్లు భేటీ అయ్యారని, నిర్ణయాలన్నీ సమిష్టిగానే తీసుకుంటున్నామని మంత్రి గుర్తుచేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ఇప్పటివరకు రూ.9,725కోట్లను ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications