వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌కు సీఆర్పీఎఫ్ బలగాలు.. వెనక్కివెళ్లిన బెటాలియన్లు రావాలని ఆదేశాలు, వ్యాలీలో హైటెన్షన్

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు తెగబడుతారనే సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడులు చేస్తారనే సమాచారంతో అలర్టయ్యారు. ఇప్పటికే అమర్ నాథ్ యాత్రికులను తిరిగివెళ్లిపోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో సీఆర్పీఎప్ బలగాలను భారీగా మొహరిస్తున్నారు. మరోవైపు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో నేతలంతా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కలువడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో గవర్నర్ స్పందిస్తూ .. శత్రుదేశ చర్యల వల్లే బలగాలను మొహరిస్తున్నామని .. భయపడాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.

కశ్మీర్‌ ప్రజల భయాందోళన.. పెట్రోల్‌బంకులు, ఏటీఏం సెంటర్ల వద్ద జనం క్యూ, భయపడొద్దంటున్న గవర్నర్ <br>కశ్మీర్‌ ప్రజల భయాందోళన.. పెట్రోల్‌బంకులు, ఏటీఏం సెంటర్ల వద్ద జనం క్యూ, భయపడొద్దంటున్న గవర్నర్

వెనక్కి రండి ..

వెనక్కి రండి ..

కానీ ఇప్పటికే వెనక్కి వెళ్లిన సీఆర్పీఎఫ్ బెటాలియన్లు తిరిగి కశ్మీర్ రావాలని ఆదేశాలు జారీచేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కశ్మీర్ వ్యాలీలో కొన్ని బెటాలియన్లు ఉన్నాయని .. అయితే పరిస్థితి సద్దుమణిగిందని కొన్ని వెళ్లిపోయాయి. దీంతో వాటిని మళ్లీ రీ కాల్ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ముఖ్యంగా అమర్ నాథ్ యాత్రికులు లక్ష్యంగా దాడులకు తెగబడతారనే సమాచారంతో .. అప్రమత్తమయ్యారు. యాత్రికుల భద్రత దృష్ట్యా వారిని వెనక్కి పంపిస్తున్నామని తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని వెనక్కి పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కశ్మీర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.

పుకార్లను నమ్మొద్దు

పుకార్లను నమ్మొద్దు

కశ్మీర్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన వివరించారు. శత్రుదేశం చర్యలకు ధీటుగా మాత్రమే స్పందిస్తున్నామని వెల్లడించారు. దీంతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు కశ్మీర్ కొండల్లో ఉన్న ప్రజలు మాత్రం బిక్కు బిక్కుమంటున్నారు. పరిస్థితి బట్టి కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులు పెట్రోల్‌ను కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు మార్కెట్లలో నిత్యవసరాల సరుకులు ఎక్కువే కొనుగోలు చేస్తున్నారు. ఏటీఎం సెంటర్ల నుంచి నగదు విత్ డ్రా చేస్తున్నారు. దీంతో పెట్రోలు బంకులు, సూపర్ మార్కెట్లు, ఏటీఏం సెంటర్ల వద్ద రద్దీ నెలకొంది. సరుకులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు బారులుతీరారు.

నో ఛార్జీస్

నో ఛార్జీస్

దీంతోపాటు విమానయాన సంస్థ క్యాన్సిల్ చార్జీలను కూడా తగ్గించడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా విమానయాన సంస్థలు టికెట్ క్యాన్సిల్ చేస్తే చార్జీ వసూల్ చేస్తాయి. కానీ ఈసారి చార్జీ విధించకపోవడం అనుమానాలు కలుగజేస్తోంది. మరో కశ్మీర్ వ్యాలీలో యాత్రలను కూడా నిషేధించారు. దీంతో కశ్మీర్‌లో ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది.

English summary
central Reserve Police Force (CRPF) personnel posted in Kashmir may not get any new leaves at a time when a cloud of panic has spread across Kashmir Valley over security-based threats. The government, citing security-based threats and possible terror attacks, on Friday asked Amarnath yatra pilgrims and tourists to cut short their stay in the Valley and leave as soon as possible. According to the J&K administration, this is one of the main reasons behind the troop deployment in the Valley. CRPF has now said that it has put constraints on the leaves of its personnel in Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X