ప్రియుడితో కల్సి కాబోయే భర్త హత్య, బెయిల్ (పిక్చర్స్)

బెంగళూరు: కాబోయే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన కేసులో ప్రధాన నిందితురాలు శుభకు సుప్రీం కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గిరీష్ అనే వ్యక్తి బనశంకరిలో ఉంటున్నాడు. వీరి ఇంటికి సమీపంలోనే న్యాయవాది శుభ ఉంటోంది. శుభ తండ్రి ప్రముఖ న్యాయవాది. పదిహేనేళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది. ఇరు కుటుంబాల పెద్దలు గిరీష్, శుభలకు వివాహం చేయాలనుకున్నారు. దీనికి వారిద్దరు కూడా అంగీకరించారు.

నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, శుభ తన జూనియర్ అరుణ్ వర్మను ప్రేమించింది. తన ప్రేమ విషయాన్ని శుభ ఎవరికీ చెప్పలేదు. అయితే, ప్రియుడితో కలిసి గీరీష్‌ను హత్య చేయించేందుకు ప్లాన్ వేసింది. ఓ రోజు రాత్రి గిరీష్, శుభలు హోటల్‌కు వెళ్లి భోజనం చేశారు. ఇంటికి వెళ్తిండగా మధ్యలో బైక్ ఆపమని శుభ చెప్పింది. గిరీష్ బైక్ ఆపాడు. ఆ సమయంలో అరుణ్ వర్మ, అతని స్నేహితులు వచ్చి గిరీష్ తల పైన ఇనుప రాడ్డుతో దాడి చేశారు.

గిరీష్ కుప్పుకూలాడు. దాడి చేసిన ముగ్గురు పరారయ్యారు. అయితే, శుభ అతనిని ఆసుపత్రికి తరలించింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులు, కుటుంబ సభ్యులను నమ్మించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గిరీష్ మరణించాడు. శుభ పైన అనుమానం వచ్చిన గిరీష్ సోదరి సునీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుభ ఫోన్ కాల్స్‌ను పరిశీలించడంతో విషయం బయట పడింది. ఈ హత్య పదేళ్ల క్రితం జరిగింది.

శుభ

శుభ

కాబోయే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన కేసులో ప్రధాన నిందితురాలు శుభకు సుప్రీం కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

శుభ

శుభ

గిరీష్ హత్య కేసులో శుభతో పాటు ఆమె ప్రియుడు అరుణ్ వర్మ, అతని స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో ప్రవేశ పెట్టారు.

శుభ

శుభ

నవంబర్ 30, 2003లో శుభ, గిరీష్‌లకు ఎంగేజ్‌మెంట్ అయింది. డిసెంబర్ 3, 2003లో గిరీష్ హత్య చేయబడ్డాడు. జనవరి 25, 2004న శుభను, ఆమె ప్రియుడు, స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. మే 17, 2010లో శుభను నిందితురాలిగా కోర్టు చెప్పింది.

శుభ

శుభ

అనంతరం ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. జూలై 25, 2010న హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్థించింది. ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. ఆగస్టు 11, 2014న సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది.

శుభతో పాటు ఆమె ప్రియుడు అరుణ్ వర్మ, అతని స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ చేసిన ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే అపరాధ రుసుం విధించింది. వీరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్థించింది. దీంతో వారు సుప్రీం కోర్టుకు వెళ్లారు. శుభకు సోమవారం బెయిల్ మంజూరయింది.

నవంబర్ 30, 2003లో శుభ, గిరీష్‌లకు ఎంగేజ్‌మెంట్ అయింది. డిసెంబర్ 3, 2003లో గిరీష్ హత్య చేయబడ్డాడు. జనవరి 25, 2004న శుభను, ఆమె ప్రియుడు, స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. మే 17, 2010లో శుభను నిందితురాలిగా కోర్టు చెప్పింది. అనంతరం ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. జూలై 25, 2010న హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్థించింది. ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. ఆగస్టు 11, 2014న సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+